Indian Railways: దేశంలో మరో రాష్ట్రం అనుసంధానం.. మిజోరం వరకు రైల్వే ట్రాక్.. వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏమిటంటే..
దేశంలోని మరో రాష్ట్రం ఇతర ప్రాంతాలతో అనుసంధానించబడింది. ప్రధానమంత్రి కనెక్ట్ నార్త్ ఈస్ట్ మిషన్ కింద మిజోరాం రాష్ట్రం భారత రైల్వేలతో అనుసంధానించబడింది. దీని స్పీడ్ ట్రయల్ బుధవారం విజయవంతంగా నిర్వహించబడింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సమాచారాన్ని అందించారు

ప్రధానమంత్రి కనెక్ట్ నార్త్ ఈస్ట్ మిషన్ కింద ఈశాన్య భారాత దేశంలోని మరో రాష్ట్రం భారత రైల్వేలతో అనుసంధానించబడింది. మిజోరాం రాజధాని ఐజ్వాల్‌కు రైలు సౌకర్యం కల్పించడానికి రైల్వే ట్రాక్‌లు వేయబడ్డాయి. దీని స్పీడ్ ట్రయల్ రన్ ఈ రోజు (బుధవారం) నిర్వహించారు. కొత్త రైల్వే ట్రాక్ మీద గూడ్స్ రైలు ప్రయాణించింది. ఈ స్పీడ్ ట్రయల్ సక్సెస్ కావడంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ ప్రకటించారు.
ఈ విజయవంతమైన ట్రయల్ రన్ తర్వాత ఈ ట్రాక్ పై ప్యాసింజర్ రైళ్లు కూడా నడవడం ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదని ప్రజలు ఆశిస్తున్నారు. ప్యాసింజర్ రైలుకు సంబంధించి ఏవైనా లాంఛనాలు ఉంటే.. వాటిని ప్రభుత్వం వీలైనంత త్వరగా పూర్తి చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.
ఐజ్వాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణం సులభతరం
ఈశాన్య ప్రాంతంలో రైలు కనెక్టివిటీతో పూర్తిగా అనుసంధానించబడిన నాల్గవ రాష్ట్రంగా ఐజ్వాల్ నిలుస్తుంది. దీనితో దేశ రాజధాని ఢిల్లీ నుంచి మిజోరాం రాజధాని ఐజ్వాల్‌కు వెళ్లే ప్రజలు ఇకపై ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి ఐజ్వాల్‌కు డైరెక్ట్ గా ట్రైన్ లో వెళ్ళవచ్చు.
ఈ మేరకు అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేసి ఈ సమాచారాన్ని అందించారు. ‘మిజోరాం రాజధాని (ఐజ్వాల్)ను భారతదేశంలోని ప్రతి హృదయానికి అనుసంధానిస్తున్నాం అని చెప్పారు.
Connecting Mizoram capital (Aizawl) to every heart of India!🇮🇳
CRS speed trial of Bairabi-Sairang new BG line project of Lumding Division – N.F. Railway. pic.twitter.com/JyRDyIzrPY
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 11, 2025
ఈ ప్రాజెక్ట్ మన ఇంజనీరింగ్ ప్రతిభకు గొప్ప ఉదాహరణ.
ఈ ప్రాజెక్టులో నాలుగు విభాగాలు ఉన్నాయి. అవి భైరవి నుంచి హోర్టోకి 16.72 కి.మీ, హోర్టోకి నుంచి కవన్‌పుయి 9.71 కి.మీ, కవన్‌పుయి నుంచి ములాఖాంగ్ 12.11 కి.మీ .. ములాఖాంగ్ నుంచి సైరాంగ్ 12.84 కి.మీ. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 51.38 కి.మీ. దీని ఖర్చు రూ. 5021.45 కోట్లు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పనిలో 97 శాతం పూర్తయింది. ఇది ఇంజనీరింగ్‌కు అద్భుతమైన ఉదాహరణ. ఈ మొత్తం ప్రాజెక్టులో 48 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలు, 87 చిన్న వంతెనలు, 5 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 6 రోడ్ అండర్ బ్రిడ్జిలు ఉన్నాయి. ఈ ట్రాక్‌లోని బ్రిడ్జి నంబర్ 196 ఎత్తు 104 మీటర్లు (కుతుబ్ మినార్ కంటే 42 మీటర్లు ఎక్కువ ఎత్తు).
ఈ రైల్వే కనెక్టివిటీ ఎందుకు వ్యూహాత్మక ప్రాముఖ్యత అంటే ఈ ప్రాంతంలో రెండు అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. ఒకటి బర్మా, మరొకటి బంగ్లాదేశ్. ఈ ట్రాక్ పూర్తి చేయడం వలన వ్యూహాత్మక దృక్కోణంలో చూస్తే మన దేశంలో ఒక చివర నుంచి మరొక చివర వరకు ప్రయాణించడం సులభం అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..