G20 Summit: సంస్కృతిని కాపాడుకుంటేనే స్థిరమైన భవిష్యత్.. జీ 20 సమ్మిట్‌లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
కర్ణాటకలోని హంపి వేదకిగా జీ20 దేశాల కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ సమ్మిట్ జులై 12 వరకు కొనసాగనున్నాయి. G20 సభ్య దేశాలు , అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు
కర్ణాటకలోని హంపి వేదకిగా జీ20 దేశాల కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ సమ్మిట్ జులై 12 వరకు కొనసాగనున్నాయి. G20 సభ్య దేశాలు , అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ‘సంస్కృతి మన గుర్తింపులో ఒక భాగం మాత్రమే కాదు. స్థిరమైన అభివృద్ధికి సూచిక. దీనిని భవిష్యత్ తరాలకు అందజేసేందుకు మనమంతా కృషి చేయాలి. ఇందుకోసం మేం నాలుగు ప్రాధాన్యతలను గుర్తించాం. 1. సాంస్కృతిక ఆస్తుల రక్షణ, పునరుద్ధరణ, 2. స్థిరమైన భవిష్యత్తు కోసం సాంస్కృతిక వారసత్వాన్ని ఉపయోగించడం, 3. సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, 4. సంస్కృతి రక్షణ, ప్రమోషన్ కోసం డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం’ అని ప్రహ్లాదక్ష జోషి చెప్పుకొచ్చారు. ఈ నాలుగు కార్యక్రమాలు సాంస్కృతికంగా విభిన్నమైనప్పటికీ ఏకీకృత ప్రపంచానికి దోహదం చేస్తాయని, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందజేయవచ్చని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
కాగా సాంస్కృతిక కార్యవర్గం మునుపటి రెండు సమావేశాలు కాజురావ్, భువనేశ్వర్‌లలో జరిగాయి . నాలుగో సమావేశం వారణాసిలో జరగనుంది. సెప్టెంబరులో G20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది , అందుకోసం గత కొన్ని నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ అనుబంధ సమావేశాలు జరిగాయి . బెంగళూరులో కూడా సమావేశాలు జరిగాయి . కాగా భారతదేశంలోని గొప్ప సామ్రాజ్యాలలో ఒకటిగా పరిగణించబడే విజయనగర రాజుల రాజధాని హంపిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. జీ 20 సమ్మిట్ సందర్భంగా హంపిలో ప్రసిద్ధి చెందిన గంజీఫా కళ , బిదరీ కళ , కింహాల హస్తకళల నిపుణులను కలిశారు ప్రతినిధులు. అదేవిధంగా లంబాణీ సంఘం కళాకారులతో సమావేశమయ్యారు. లంబానీ ఎంబ్రాయిడరీ ప్యాచ్‌ల అతిపెద్ద ప్రదర్శనను సృష్టించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు .ఇందులో లంబానీ కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా మహిళా కళాకారులు పాల్గొంటారు, సండూర్ కుశల కళా కేంద్రంతో దగ్గరి అనుబంధం కలిగిన వారు దాదాపు 1300 లంబానీ ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్‌లను ప్రదర్శించారు .
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..