శివసేన కార్యకర్తలు పిస్టల్స్ చూపి బెదిరించారు, ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆరోపణ

మహారాష్ట్రలో శివసేన కార్యకర్తల ఆగడాలు శృతి మించుతున్నాయని ఔరంగాబాద్ ఎం ఐ ఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆరోపించారు.

శివసేన కార్యకర్తలు పిస్టల్స్ చూపి బెదిరించారు, ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆరోపణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 30, 2021 | 6:00 PM

మహారాష్ట్రలో శివసేన కార్యకర్తల ఆగడాలు శృతి మించుతున్నాయని ఔరంగాబాద్ ఎం ఐ ఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆరోపించారు. ఇందుకు ఉదాహరణగా ఆయన.. ఇటీవల పూణే-ముంబై హైవేపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు డ్రైవర్ ను బెదిరించేందుకు శివసేన కార్యకర్తలు తమ వాహనం నుంచి రివాల్వర్లు చూపి బెదిరించారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు. తమ వాహనాన్ని దాటి ఆ ట్రక్కు వెళ్తున్నందుకు ఆగ్రహించిన వారు ఈ బెదిరింపులకు దిగినట్టు కనిపిస్తోందన్నారు. ఆ వాహనంపై శివసేన  పార్టీ చిహ్నం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తాము దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు జలీల్ పేర్కొన్నారు. కాగా- దీనిపై దర్యాప్తు జరిపిస్తామని సేన అధికార ప్రతినిధి అరవింద్ సావంత్ ప్రకటించారు. ఈ వాహనంలో ఎవరు ప్రయాణిస్తున్నారు, ఆ కారు  రిజిస్ట్రేషన్ నెంబర్ తదితరాలను తెలుసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.

పార్టీ పేరు చెప్పి ఎవరు  ఈ విధమైన బెదిరింపు చర్యలకు దిగినా తాము సహించబోమన్నారు. అటు- గత సెప్టెంబరులో రిటైర్డ్ నేవీ అధికారిపై శివసేన గూండాలు దాడి చేశారని బీజేపీ ఆరోపించిన విషయాన్ని జలీల్ గుర్తు చేశారు. సీఎం ఉధ్ధవ్ థాక్రే క్యారికేచర్ ని వ్యంగ్యంగా వేసినందుకు ఆ అధికారి ఇంటికి వెళ్లి ఆయన వెంటబడి తరిమి వారు కొట్టారు.