AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: మహిళలపై అఘాయిత్యాలు తగ్గేలా రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌

మణిపూర్‌ హింసా ఘటనలపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మరోసారి స్పందించారు. 'ఏ రాష్ట్రంలోనైనా మహిళలపై అఘాయిత్యాలు క్షమించరానివి. వాటిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మహిళలపై నేరాలు తగ్గించడంపై రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి.

Manipur Violence: మహిళలపై అఘాయిత్యాలు తగ్గేలా రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌
Anurag Thakur
Basha Shek
|

Updated on: Jul 23, 2023 | 3:02 PM

Share

మణిపూర్‌లోని ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో మణిపూర్‌ హింసా ఘటనలపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మరోసారి స్పందించారు. ‘ఏ రాష్ట్రంలోనైనా మహిళలపై అఘాయిత్యాలు క్షమించరానివి. వాటిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మహిళలపై నేరాలు తగ్గించడంపై రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి. అలాగే ఈ విషయంపై చర్చల నుంచి తప్పించుకునే ధోరణి వద్దని ప్రతిపక్షాలను అభ్యర్తిస్తున్నాను. ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దు’ అని అనురాగ్‌ కోరారు.

కాగా మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ అమానవీయ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని నిందితులందరినీ పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు .అలాగే సంబంధిత బాధితులకు న్యాయం చేస్తామని మణిపూర్‌ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మరోవైపు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌ కూటమి వర్షాకాల సమావేశాల మొదటి రోజు షెడ్యూల్ చేసిన ఎజెండాను పక్కన పెట్టి మణిపూర్ సమస్యపై చర్చించడానికి వీలుగా అనేక వాయిదా తీర్మానాలను కూడా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్