రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తమిళనాడులోని వెల్లూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. రద్దీగా ఉండే రోడ్డులో ఓ వ్యక్తి తన భార్యను పలుమార్లు కత్తితో పొడిచి చంపుతున్న భయానక వీడియో బయటపడింది. సమీపంలో అమర్చిన సీసీటీవీలో ఈ దారుణ ఘటన రికార్డయింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. రోడ్డుపై వెళ్తున్న ప్రజలు ఈ దారుణాన్ని చూస్తున్నారే గానీ, ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. బాధితురాలు రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోమవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్తుండగా భర్త జైశంకర్ ఆమెపై దాడి చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.