Viral: శృంగారం చేద్దామంటూ భార్యను కోరాడు.. కట్ చేస్తే.. భర్త చేసిన పనికి.!
భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న తగాదాలే.. పెద్దవిగా మారి.. అసలేం జరిగిందంటే.. ఆ ఘటన గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం..

దాంపత్య జీవితంలో గొడవలు రావడం అనేది సర్వసాధారణం. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు అయితే.. ఇలాంటివి ఇట్టే సద్దుమనిగిపోతాయ్. ఒకవేళ అలా కాకపోతే మాత్రం ఆ గొడవలు.. కాస్తా తీవ్ర వాగ్వాదానికి.. చివరికి షాకింగ్ సంఘటనలకు దారి తీస్తాయి. కొన్ని విషయాల్లో ఇద్దరిలో ఎవరైనా కూడా చూసి చూడనట్లుగా ఉంటేనే.. అంతా బాగుంటుంది. లేదంటే ఆ చిన్న చిన్న తగాదాలే.. పెద్దవిగా మారి.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం. లేదా ప్రాణాలు తీసేయడం వంటివి జరుగుతుంటాయి. సరిగ్గా ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటన ఛతీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దానిని మీరూ చూస్తే.. కచ్చితంగా షాక్ కావడం ఖాయం.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాకు చెందిన శంకర్‌రామ్, అశాబాయి భార్యభర్తలు. శంకర్ రామ్ ఒక తాగుబోతు. ప్రతీరోజూ ఇంటికి తాగి వచ్చేవాడు. దీంతో భార్యభర్తల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే శంకర్ రామ్ మళ్లీ సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చాడు. భార్యను శృంగారం చేద్దామని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అతడికి టార్చర్ తట్టుకోలేని ఆశాబాయి బావిలోకి దూకింది. వెంటనే అప్రమత్తమైన భర్త బావిలోకి దూకి.. ఆమెను రక్షించాడు.
భార్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నా.. కనికరించని శంకర్ రామ్ తనతో శృంగారం చేయాలంటూ బలవంతం చేశాడు. దీంతో మళ్లీ భార్యభర్తల మధ్య గొడవ మొదలై.. అది తీవ్రమైంది. క్షణికావేశంలో భార్య ఆశాబాయిపై దాడి చేసి చంపేశాడు భర్త శంకర్ రామ్. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
