AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Elections: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కనిపించని యువ నేత పేరు.. బీజేపీ నుంచి వచ్చిన నేతకు టాప్ ప్లేస్..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. బీజేపీ నుంచి వచ్చిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా చోటు దక్కగా.. రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు సచిన్ పైలట్ పేరు జాబితా నుంచి తప్పించారు. ఇక బీజేపీ 40 మందితో స్టార్ వారియరల్స్‌ను ప్రకటించింది.

Karnataka Elections: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కనిపించని యువ నేత పేరు.. బీజేపీ నుంచి వచ్చిన నేతకు టాప్ ప్లేస్..
Star Campaigners For Karnataka Elections
Sanjay Kasula
|

Updated on: Apr 19, 2023 | 6:55 PM

Share

కర్నాటకలో పొలిటికల్ రన్ మొదలైంది. సామాన్యుడి నుంచి సంపన్న ఓటరును ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు వీరు అని తేడా లేకుండా అందరూ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రతి పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాబితాను విడుదల చేయగా.. తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. బీజేపీ నుంచి వచ్చిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా చేసింది. దీంతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నాయి.

అలాగే, సీఎం అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, మొహమ్మద్ ఖాన్. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అజారుద్దీన్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కన్హయ్య కుమార్‌లు కూడా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న రాజ్ బబ్బర్, దివ్య సపందన కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు సచిన్ పైలట్ పేరు జాబితా నుంచి తొలగించింది.

అదే సమయంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా 40 మంది పేర్లు ఉన్నాయి. ఏప్రిల్ 26, 30 తేదీల్లో కాకుండా మే 6న కర్ణాటకలో ర్యాలీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ సిద్ధమవుతున్నారు.

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల పేర్లు

  1. పీఎం నరేంద్ర మోదీ
  2. జగత్ ప్రకాష్ నడ్డా
  3. రాజ్‌నాథ్ సింగ్
  4.  అమిత్ షా
  5.  నితిన్ గడ్కరీ
  6. బీఎస్ యడ్యూరప్ప
  7. నళిన్ కుమార్ కటీల్
  8. బసవరాజ్ బొమ్మై
  9. ప్రహ్లాద్ జోషి
  10. డీవీ సదానంద గౌడ
  11. కెఎస్ ఈశ్వరప్ప
  12. ఎం గోవింద్ కర్జోల్
  13. ఆర్ అశోక్
  14. నిర్మలా సీతారామన్
  15. స్మృతి ఇరానీ
  16. ధర్మేంద్ర ప్రధాన్
  17. మన్సుఖ్ భాయ్ మాండవ్య
  18. కె అన్నామలై
  19. అరుణ్ సింహ
  20. డీకే అరుణ (తెలంగాణ)
  21.  సీటీ రవి
  22. సీఎం యోగి ఆదిత్యనాథ్
  23. శివరాజ్ సింహ చౌహాన్
  24. హేమంత బిస్వా సరమాః
  25. దేవేంద్ర ఫడణవీస్
  26. ప్రభాకర్ కోరే
  27. శోభా కరందలజా
  28. ఎ నారాయణస్వామి
  29. భగవంత ఖుబా
  30. అరవింద లింబవల్లి
  31. బి శ్రీరాములు
  32. కోట శ్రీనివాస పూజారి
  33. బసనగౌడ పాటిల్ యతనాల్
  34. ఉమేష్ జాధవ్
  35. చలవది నారాయణస్వామి
  36. ఎన్ రవికుమార్
  37.  జీవీ రాజేష్
  38. జగ్గేష్
  39. శ్రుతి
  40. తారా అనురాధ

కర్నాటకలో మే 10న ఒకే దశ ఓటింగ్ జరగనుంది. అయితే మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. ముఖ్యంగా, 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగుస్తుంది. కర్నాటకలో రానున్న ఎన్నికల్లో 9.17 లక్షల మందికి పైగా మొదటి సారి ఓటర్లు పాల్గొంటారని రాజీవ్ కుమార్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం