Karnataka Elections: వ్యూహాలకు పదును.. ప్రతికూలాంశాలు మెండు.. వెరసి కన్నడ నాట మరోసారి కమలం వికసించేనా?

మాజీ ముఖ్యమంత్రుల్లో ఒకరు పార్టీ వీడినా పట్టించుకోని బీజేపీ అధినాయకత్వం మరో ముఖ్యమంత్రి, అత్యంత కీలక నేతకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. కర్నాటకలో మరోసారి పాగా వేయాలనుకుంటున్న బీజేపీ...

Karnataka Elections: వ్యూహాలకు పదును.. ప్రతికూలాంశాలు మెండు.. వెరసి కన్నడ నాట మరోసారి కమలం వికసించేనా?
Karnataka Map Basavaraj Bommai, Yadiyurappa,jp Nadda, Amit Shah, Modi
Follow us

|

Updated on: Apr 19, 2023 | 3:45 PM

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకీ మహా ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీలో దిగ్గజాలను పక్కన పెట్టి మరీ ప్రత్యేక వ్యూహంతో కమలనాథులు ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రుల్లో ఒకరు పార్టీ వీడినా పట్టించుకోని బీజేపీ అధినాయకత్వం మరో ముఖ్యమంత్రి, అత్యంత కీలక నేతకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. కర్నాటకలో మరోసారి పాగా వేయాలనుకుంటున్న బీజేపీ అధినాయకత్వం దానికి అనుగుణంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. రెండేళ్ళ క్రితం కర్నాటకంలో బీజేపీ పోషించిన పాత్ర, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు ఇప్పటికింకా ఎవరూ మరిచిపోలేదు. దాంతో ఆనాటా కర్నాటకం తాజా ఎన్నికల మీద ప్రభావం చూపుతుందన్నది చాలా అభిప్రాయం. ఎన్నికలకు ముందే సీఎం సీటు కోసం మహామహులు పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ధీటైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భావిస్తోంది. ఆలూ లేదు.. చూలు లేదు గానీ.. కర్నాటక కాంగ్రెస్‌లో సీఎం సీటుపై రచ్చ బాగానే జరుగుతోంది. ఓవైపు మాజీ సీఎం సిద్దరామయ్య, ఇంకోవైపు డి.కే. శివకుమార్ తానంటే తానే కాబోయే సీఎం అని ఇప్పట్నించే చెప్పుకుంటున్నారు. దానికి అనుగుణంగానే తమ వర్గం వారికి టిక్కెట్లు ఇప్పించుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.

స్టార్ క్యాంపెయినర్లలో వీరే కీలకం

ఎన్నికల ప్రచారంలోకి తురుపు ముక్కలను సిద్దం చేసింది భారతీయ జనతా పార్టీ. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల వెల్లడించింది. నలభై మందికిందులో స్థానం కలిపించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, మన్సూక్ మాండవీయ, భగవంత్ ఖూబా, కర్నాటక సిట్టింగ్ సీఎం బస్వరాజ్ బొమ్మైతోపాటు ముఖ్యమంత్రులు యోగీ ఆదిత్యనాథ్ సింగ్, హిమంతబిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అవకాశమిచ్చారు. దక్షిణ కన్నడ ప్రాంతంలోని తమిళనాడు పొరుగున ఉన్న జిల్లాల్లో అన్నామలైని వినియోగించుకుంటారని, బెంగళూరు సిటీలో పెద్ద సంఖ్యలో వున్న తమిళులను ప్రభావితం చేయడానికి ఆయన ఉపయోగపడతారని బీజేపీ పెద్దలు భావిస్తూ వుండొచ్చు. కాగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించారు. ఆమె ఇప్పటికే కర్నాటక రాష్ట్ర వ్యవహారాల అదనపు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. గద్వాల ప్రాంతానికి పొరుగున వున్న కన్నడ ప్రాంతాలు రాయచూర్, గంగావతి, బెళ్ళారి, బీదర్, కలబురిగి వంటి ప్రాంతాల్లో డికే అరుణ సేవలను పార్టీ వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి కర్నాటకలోనే ఎక్కువ సమయం గడుపుతూ డికే అరుణ జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

కోస్టల్ కర్నాటకలో కన్ఫ్యూజన్

ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళుతున్న బీజేపీ ఈసారి కర్నాటకలో చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టింది. కొత్త ముఖాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఇది కాస్తా బీజేపీకి బాగా పట్టుందని భావించే పశ్చిమ కర్నాటకలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. కోస్టల్ కర్నాటకలో అభ్యర్థులెవరైనా మా ఓటు కమలం గుర్తుకే అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇపుడు బీజేపీ నేతలు కన్ఫ్యూజ్ అయ్యే స్థితికి చేరారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సౌత్ కర్నాటక, నార్త్ కన్నడ జిల్లాలతోపాటు ఉడిపి ఏరియాను కలిపి కరావళి అని పిలుస్తారు. ఈ ప్రాంతంలోనే బీజేపీ తొలుత బలపడింది. ఒకరకంగా చెప్పాలంటే కరావళి ప్రాంతం బీజేపీకి కన్నడ నాట పుట్టిల్లుగా భావిస్తారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ కాంగ్రెస్‌కు పట్టున్న కరావళి ఏరియాలో 1983 నుంచి బీజేపీ ప్రభావం చూపుతోంది. 1989 నుంచి ఇప్పటిదాకా ప్రతి లోక్‌సభ ఎన్నికల్లోనూ సౌత్ కర్నాటక ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చి కమలనాథులు క్రమంగా బలపడ్డారు. గత ఎన్నికల్లో మూడు సీట్లు మినహా అన్నీ బీజేపీ ఖాతాలో పడ్డాయి. కానీ ఈసారి ఆ ఫలితాలు పునరావృతం అవుతాయని బీజేపీ నేతలే ధీమాగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దానికి కారణం పెద్ద సంఖ్యలో సిట్టింగులను మార్చేయడమేనని తెలుస్తోంది. కరావళి ఏరియా మతపరంగా సున్నితమైంది. బీజేపీ హిందుత్వ వాదం గట్టిగా వినిపిస్తుంటుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)‌ ఇక్కడ నిత్య శాఖలతో చాలా బలంగా ఉంది. అనేక ఉగ్రవాద సంఘటనలకు లింకులు ఈ ప్రాంతంలో లభిస్తూంటాయి. వివాదాస్పద పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకలాపాలూ ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. అందుకే మతం, విభజన తరచూ ఉద్వేగాంశాలుగా మారి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. మతపరమైన సెంటిమెంట్లను బీజేపీ బాగా వాడుకుంటుందన్నది ప్రతిపక్షాల ఆరోపణ.

దిగ్గజాలకు షాకిచ్చిన బీజేపీ

అయితే, బీజేపీ వాదన ఇంకోలా ఉంది. తమ పాలనలో అందరినీ సమంగా చూసుకుంటున్నామని, ప్రజలకు భద్రత కల్పిస్తున్నామని చెబుతోంది. 2018కి ముందు పార్టీ కార్యకర్తలపై పీఎఫ్‌ఐ (పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా) దాడులను కమలనాథులు ఎత్తి చూపారు. హిందువులకు భద్రత లేకుండా పోయిందని జన సురక్ష యాత్రలు నిర్వహించింది. గత సంవత్సరం బీజేవైఎం నేత ప్రవీణ్‌ హత్య కరావళి ఏరియాలో పెను సంచలనం సృష్టించింది. ప్రవీణ్ కుటుంబాన్ని ఓదార్చడానికి దక్షిణ కర్నాటక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ వస్తే… పార్టీ యువ మోర్చా కార్యకర్తలే ఆయనను రాకుండా అడ్డుకున్నారు. సొంత పార్టీ అధికారంలో వున్నా తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంజేశారు. దీనికి తోడు… కుల సమీకరణాల్లో అసంతృప్తులు పెరిగాయి. ముఖ్యంగా ఓబీసీల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పట్ల అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. కీలకమైన బిల్లవ వర్గానికి చెందిన ప్రముఖ నేత సత్యజిత్‌ పార్టీకి రాజీనామా చేశారు. జాతీయ నాయకత్వం, మోదీపై సానుకూల దృక్పథం ఇంకా ఉండటమే బీజేపీకి కాసింత ఆశగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులను గమనించి అధిష్ఠానం.. ఉడిపి, దక్షిణ కర్నాటక జిల్లాల్లో సగం మంది అభ్యర్థులను మార్చేసింది. పీఎఫ్‌ఐపై నిషేధం విధించిన నేపథ్యంలో తమ కార్యకర్తల అసంతృప్పి కొంతైనా తగ్గుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. పీఎఫ్‌ఐ రాజకీయ విభాగమైన సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ) ఎన్నికల్లో దిగుతుండటం ఇక్కడి రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇది బీజేపీకి ఎంతమేరకు లాభిస్తుందన్నది చూడాలి. మతపరమైన సున్నిత అంశాలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం, అభివృద్ధి పనులను చూపుతూ.. బీజేపీ ముందుకు సాగుతుంటే.. ఆ పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ పార్టీ విజయవకాశాలను ఏ మేరకు దెబ్బకొడతారన్నది ఆసక్తిరేపుతోంది. మరోవైపు తన వర్గానికి టిక్కెట్లు ఇప్పించుకోలేక చతికిల పడిన కీలక నేత, మాజీ సీఎం యడియూరప్ప పోలింగుకు ముందు ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది కూడా అత్యంత కీలకం. వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న కమలం పార్టీకి అదే స్థాయిలో ప్రతికూలాంశాలు కనిపిస్తున్నాయి. తద్వారా కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

Latest Articles
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అద్భుతం.. చీనాబ్ వంతెనపై చుక్ బుక్ రైలు పరుగులు
అద్భుతం.. చీనాబ్ వంతెనపై చుక్ బుక్ రైలు పరుగులు
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్