పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
శీతాకాలంలో ప్రకృతి ఎంతో అందగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఈ సీజన్‌లో అనేక రకాల పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు విస్తృతంగా మార్కెట్లోకి వస్తాయి. సీజనల్ పండ్లు, కూరగాయలు తినమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే, ఆకు కూరలలో పొన్నగంటి కూర గురించి మీకు తెలుసా..? ఇది పోషకాల పుట్ట. ఆరోగ్యానికి ఔషధనిది. పొన్నగంటి కూరను ఆహారంలో భాగంగా తీసుకుంటే లెక్కలేనన్నీ లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

పొన్నగంటి కూర.. గ్రామీణ నేపథ్యం కలిగిన వారికి ఎక్కువగా తెలిసి ఉంటుంది. పట్టణాల్లో ఆకు కూరలు విక్రయించే వారు తప్పనిసరిగా పొన్నగంటి కూడా అమ్ముతుంటారు. ఇది అమరాంథేసి కుటుంబానికి చెందిన ఆకుకూర. ఇది చాలా పోషకమైనది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పొన్నగంటి కూర కేవలం శీతాకాలంలో మాత్రమే కాదు..ఏడాది పొడవునా లభిస్తుంది. పొన్నగంటి ఆకులో బి6, సి, ఏ విటమిన్లతోపాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. పొన్నగంటితో గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సహాన్ని ఇస్తుంది. బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి. ఎముకలకు బలం.
పొన్నగంటి ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పొన్నగంటి ఆకుల్లో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. పొన్నగంటి ఆకుల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి క్యాన్సర్ వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి. ఈ కూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇది రాత్రి కురుపు వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
పొన్నగంటి ఆకుల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పొన్నగంటి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, టాన్సిలిటిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. పొన్నగంటి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పొన్నగంటి ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




