ప్రియురాల్ని చంపి ట్యాంకులో దాచిపెట్టిన ప్రియుడు.. చివరికి
ఇటీల ప్రేమికుల మధ్య హత్యలు పెరిగిపోతున్నాయి. పలు కారణాలతో ఒకరికోరు గొడవ పడటం.. క్షణికావేశంలో అమ్మాయిని అబ్బాయి హత్య చేయడం లేదా అబ్బాయిని అమ్మయి హత్య చేయడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరికొందరు తమ ప్రేమించిన అమ్మాయిలను హత్య చేసి శరీర భాగాలలను ముక్కలు చేసిన ఉదంతాలు సైతం ఇటీవల వెలుగుచూశాయి.

ఇటీల ప్రేమికుల మధ్య హత్యలు పెరిగిపోతున్నాయి. పలు కారణాలతో ఒకరికోరు గొడవ పడటం.. క్షణికావేశంలో అమ్మాయిని అబ్బాయి హత్య చేయడం లేదా అబ్బాయిని అమ్మయి హత్య చేయడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరికొందరు తమ ప్రేమించిన అమ్మాయిలను హత్య చేసి శరీర భాగాలలను ముక్కలు చేసిన ఉదంతాలు సైతం ఇటీవల వెలుగుచూశాయి. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన ప్రియురాల్ని హత్య చేయడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే యమునాపార్ కర్ఛానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేవాలో అరవింద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
అతనికి రాజ్ కేసర్ అనే ప్రియురాలు ఉంది. అయితే పదిహేను రోజుల క్రితం అరవింద్.. కేసర్‌ను హత్య చేశాడు. అనంతరం ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని తన ఇంటివద్దనే ఉన్న ట్యాంక్‌లో దాచిపెట్టాడు. మే 30వ తేదిన కేసర్ కుబుంబ సభ్యులు తమ అమ్మాయి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి ఆమె సెల్‌ఫోన్ వివరాల ఆధారంగా అరవింద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అరవింద్ ఆమెను ఎందుకు హత్య చేశాడు.. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం..