Social Media: ఇన్స్టాలో పరిచయం.. లివింగ్ రిలేషన్గా మారిన ప్రయాణం.. కట్ చేస్తే జరిగిందిదే..
ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాలల్లో పరిచయాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ముక్కు, మొహం తెలియని వాళ్లతో పరిచయం చేసుకోవాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, వాట్సప్ వంటి మాధ్యమాల్లో ముఖంతోపాటూ వారి చేష్టలు, ఇష్టమైన ప్రదేశాలు, అలవాట్లు అన్నింటినీ పోస్ట్ చేస్తూన్నారు నేటి యువత. ఇలా పరిచయం ఏర్పడిన వాళ్లతో కలిసి జీవించేందుకు సిద్దపడుతున్నారు.
ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాలల్లో పరిచయాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ముక్కు, మొహం తెలియని వాళ్లతో పరిచయం చేసుకోవాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, వాట్సప్ వంటి మాధ్యమాల్లో ముఖంతోపాటూ వారి చేష్టలు, ఇష్టమైన ప్రదేశాలు, అలవాట్లు అన్నింటినీ పోస్ట్ చేస్తూన్నారు నేటి యువత. ఇలా పరిచయం ఏర్పడిన వాళ్లతో కలిసి జీవించేందుకు సిద్దపడుతున్నారు. దీంతో అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన కూడా అలాంటిదే.
తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించినందుకు 20 ఏళ్ల మహిళను ఒక వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన బుధవారం ఇండోర్‌లో చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన మహిళ, నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులుగా మారినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గత కొద్ది రోజులుగా నగరంలోని అద్దె ఇంట్లో లివింగ్ రిలేషన్ షిప్లో నివసిస్తున్నారని పోలీసు అధికారి వెల్లడించారు. డిసెంబరు 7న రావుజీ బజార్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో మహిళ హత్యకు గురైందని, రెండు రోజుల తర్వాత డిసెంబర్ 9న ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినయ్ విశ్వకర్మ విలేకరులకు తెలిపారు.
వాస్తవానికి గుణ జిల్లాకు చెందిన నిందితుడు ప్రవీణ్ సింగ్ ధాకడ్ (24) తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి బాధితురాలు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన ఆమె మెడపై కత్తితో పొడిచి చంపినట్లు తెలిపారు. మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ధృవీకరించారు. నిందితుడు భయాందోళనకు గురై ఇంటి బయట నుంచి తాళం వేసి పారిపోయాడు. ఆమె మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు. హత్య వెలుగులోకి రావడంతో నిందితుడిని ట్రాక్ చేసి అరెస్టు చేసినట్లు కమిషనర్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..