Murder Case: భార్యను చంపి.. నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయని భర్త.. అనాథలైన చిన్నారులు

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మండ్య జిల్లా మలవల్లి తాలూకా దేశ్‌హళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. దేశ్‌హళ్లి గ్రామంలో నివాసం ఉంటోన్న మధుశ్రీ(32), మహదేవ్ (38) దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు 8 సంవత్సరాల, 6 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహదేవ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య..

Murder Case: భార్యను చంపి.. నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయని భర్త.. అనాథలైన చిన్నారులు
Husband Killed Wife
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2023 | 5:38 PM

మాండ్య, డిసెంబర్‌ 12: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మండ్య జిల్లా మలవల్లి తాలూకా దేశ్‌హళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. దేశ్‌హళ్లి గ్రామంలో నివాసం ఉంటోన్న మధుశ్రీ(32), మహదేవ్ (38) దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు 8 సంవత్సరాల, 6 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహదేవ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరిగడం ప్రారంభమయ్యాయి. గత రాత్రి దంపతులిద్దరూ మరోమారు గొడవ పడ్డారు. దీంతో కోపోధ్రిక్తుడైన మహదేవ్‌ భార్య తలపై ఇనుప రాడ్డు, కర్రతో బలంగా మోదాడు. దీంతో మహిళ తలకు బలమైన గాయమైంది. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు మహదేవ్ కిరుగవలూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మరో ఘటన: తోబుట్టువులకు ఆస్తిలో వాట.. అంతా నాకే కావాలంటూ తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు

ఆడపిల్లలకు ఆస్తి ఇస్తామనడంతో కోపోధ్రిక్తుడైన కొడుకు తల్లిదండ్రులను హతమార్చాడు. ఈ ఘటన కర్నాటకలోని హొస్కోటేలో సోమవారం (డిసెంబర్ 11) వెలుగులోకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హొస్కోటేలో నివాసం ఉంటోన్న రామకృష్ణప్ప (70), మునిరమక్క (65) అనే వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. తల్లిదండ్రులను హత్య చేశాడనే ఆరోపణపై కొడుకు నరసింహమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గురైన రామకృష్ణప్ప, మునిరమక్క దంపతులకు ఐదుగురు సంతానం. ఐదుగురు పిల్లలలో నలుగురు కూతుళ్లు, ఒక్కడే కొడుకు ఉన్నారు. అయితే కొడుకు నరసింహమూర్తి పెళ్లయినప్పటి నుంచి వేరే ఇంట్లో కాపురం ఉంటున్నాడు.

ఇటీవల ఆస్తి విభజన విషయంలో కొడుకు, తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగింది. ఆడపిల్లలందరికీ పెళ్లిళ్లు చేశామని, ఆస్తులు పంచడానికి వీలులేదని కొడుకు నరసింహమూర్తి తేల్చి చెప్పాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు అతని మాట వినకపోవడంతో చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే కూతుళ్లకు ఆస్తిలో వాటా ఇవ్వాలనేది వృద్ధ దంపతుల కోరిక. ఈ నేపథ్యంలో సోమవారం తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి వెళ్లిన నరసింహమూర్తి తల్లిదండ్రులతో గొడవపడి తండ్రి రామకృష్ణప్ప, తల్లి మునిరమక్కలను రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.