AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Teargas: పార్లమెంట్ టియర్ గ్యాస్ ఘటనపై లోతుగా విచారణ.. నిందితులు లోనికి ఎలా ప్రవేశించారంటే..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. ఘటన జరగడానికి కారణమేంటి.? ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు.? దాడి వెనుక ఉన్నదెవరు.? పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ దాడి జరిగిందా.? ఇందులో భద్రతా వైఫల్యం ఎంత.? అనే కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Parliament Teargas: పార్లమెంట్ టియర్ గ్యాస్ ఘటనపై లోతుగా విచారణ.. నిందితులు లోనికి ఎలా ప్రవేశించారంటే..
Parliament Tear Gas
Mahatma Kodiyar
| Edited By: Srikar T|

Updated on: Dec 14, 2023 | 10:33 AM

Share

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. ఘటన జరగడానికి కారణమేంటి.? ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు.? దాడి వెనుక ఉన్నదెవరు.? పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ దాడి జరిగిందా.? ఇందులో భద్రతా వైఫల్యం ఎంత.? అనే కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది.

పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ సాగర్‌శర్మ, మనోరంజన్‌, నీలం, ఆమోల్‌ షిండే, గురుగావ్‌లో వారికి ఆశ్రయం కల్పించిన విక్కీశర్మ, అతని భార్యను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. నీలం గతంలో పలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారా.? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ ఏడుగురు నిందితులు భగత్‌సింగ్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ పేరుతో ఓ సోషల్‌ మీడియా గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా నిందితులు ఒకరినొకరు పరిచయం అయ్యారు. వీరంతా ఏడాదిన్నర క్రితం మైసూరులో కలిసినట్లు తెలుస్తోంది. 9 నెలల క్రితం మరోసారి కలిసినట్లు సమాచారం. జులైలోనే లక్నో నుంచి ఢిల్లీ వచ్చాడు సాగర్‌శర్మ. అప్పుడే పార్లమెంట్ సెక్యూరిటీ ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. పార్లమెంట్‌లో పొగదాడి కోసం నిందితులు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. గుర్గావ్‌లోని విక్కీశర్మ ఇంట్లో బసచేసి పథక రచన చేశారు. మహారాష్ట్ర నుంచి స్మోక్‌ క్యాన్లను ఆమోల్‌ షిండే తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇండియాగేట్‌ దగ్గర మీటింగ్‌ పెట్టుకొని స్మోక్‌ క్యాన్లను అందరూ పంచుకున్నారు. ఆరుగురు పాసులు తీసుకొని లోపలికి వెళ్లాలని పథకం రచించారు. కానీ మనో రంజన్‌, సాగర్‌శర్మకు మాత్రమే పాసులు లభించాయి. వీళ్లిద్దరు మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా పీఏ ద్వారా పాసుల కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి స్మోక్‌ క్యాన్లు ప్రయోగించారు సాగర్‌శర్మ, మనో రంజన్‌. పార్లమెంట్‌ కాంపౌండ్‌ వెలుపల గేట్‌ దగ్గర పొగబాంబు ప్రయోగించి నీలం, ఆమోల్‌ షిండే నినాదాలు చేశారు. వాళ్లిద్దరిని పోలీసులు పట్టుకోగానే విక్కీశర్మ, లలిత్‌ ఝూ పరారయ్యారు. అనంతరం విక్కీశర్మ, అతని భార్యను గుర్గావ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు సాగర్‌శర్మ ఈ-రిక్షా నడుపుకుంటూ జీవనం సాగించేవాడని తెలిసింది. రెండ్రోజుల క్రితం స్నేహితులతో వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఈ ఘటనకు పాల్పడ్డట్లు వెల్లడించారు.

పార్లమెంట్ ఘటనలో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు

ఐపిసి సెక్షన్‌ 120-బి (నేరపూరిత కుట్ర), 452 (నిబంధనలు అతిక్రమించడం), సెక్షన్ 153 (అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం ), 186 (ప్రజా విధుల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం), 353 (దాడి నేరపూరిత కుట్ర), ఉపా చట్టం (UAPA) 16,18 సెక్షన్ల కింద కేసునమోదు చేసిన పోలీసులు. తదుపరి విచారణ కోసం కేసును స్పెషల్ సెల్‌కు బదిలీ చేశారు. పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసులో ఏడో వ్యక్తిని కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పరారీలో ఉన్న లలిత్ ఝా కోసం వెతుకుతున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‎కు చెందిన రెండు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. రాజస్థాన్ నీమ్రానా వద్ద లలిత్ ఝా చివరి లొకేషన్‎ను పోలీసులు గుర్తించారు. నిన్నటి నుంచి లలిత్ ఝా కోసం రంగంలోకి దిగిన ముమ్మరంగా గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..