Viral: ఎమిరావారీ.. ఎక్కడా చోటు లేనట్లు బంగారం అక్కడ దాచుకొచ్చాడు.. కట్ చేస్తే..

అక్రమార్కులు సరికొత్త ఎత్తుగడలతో స్మగ్లింగ్ చేసేందుకు స్కెచ్చులు వేస్తుంటారు.. అయితే, అలాంటివారి ప్లాన్‌లకు అధికారులు సైతం దిమ్మతిరిగేలా సమాధానమిస్తుంటారు..

Viral: ఎమిరావారీ.. ఎక్కడా చోటు లేనట్లు బంగారం అక్కడ దాచుకొచ్చాడు.. కట్ చేస్తే..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 18, 2023 | 5:29 PM

అక్రమార్కులు సరికొత్త ఎత్తుగడలతో స్మగ్లింగ్ చేసేందుకు స్కెచ్చులు వేస్తుంటారు.. అయితే, అలాంటివారి ప్లాన్‌లకు అధికారులు సైతం దిమ్మతిరిగేలా సమాధానమిస్తుంటారు.. ఇలాంటి ఎన్నో సంఘటనలను మనం చూసుంటాం.. వినుంటాం.. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలిస్తూ.. పట్టుబడుతున్నవారిని మనం ఇటీవల బాగానే చూస్తున్నాం.. చెప్పుల్లో, బెల్టుల్లో, కడుపులో.. లో దుస్తుల్లో ఇలా ఎన్నో చూసాం.. కానీ.. ఓ వ్యక్తి మాత్రం దీనికి భిన్నంగా.. కొత్తగా ఆలోచించాడు.. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కుమార్తె డైపర్‌ను ఉపయోగించాడు.. చివరకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ షాకింగ్ ఘటన మంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి కుమార్తె డైపర్ లో బంగారం దాచి పట్టుబడినట్లు కస్టమ్స్‌ అధికారులు శనివారం ప్రకటన విడుదల చేశారు.

అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ వ్యక్తి తన 22 నెలల కూమార్తె ధరించిన డైపర్‌లో బంగారాన్ని దాచాడు. అధికారులు తనిఖీ చేయగా బంగారంతో అడ్డంగా దొరికిపోయాడు. బంగారాన్ని పేస్ట్‌ రూపంలో ప్యాకెట్లుగా రూపొందించి డైపర్‌లో ఉంచినట్లు అధికారులు గుర్తించారు. మరో ఘటనలో ఓ ప్రయాణికుడు తన నడుముకు ధరించే బెల్ట్‌కు బంగారాన్ని అతికించాడు. మరో వ్యక్తి తన రహస్య భాగాల్లో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ముగ్గురినీ అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో రూ.90.67 లక్షల విలువ గల 1606 గ్రాములు పుత్తడిని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

అంతర్జాతీయ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు తన 21 నెలల కుమార్తె డైపర్‌లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఇటీవల మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో (MIA) పట్టుబడ్డాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనుమానం వచ్చి అధికారులు తనిఖీ చేయగా బంగారంతో దొరికిపోయాడని తెలిపారు. బంగారాన్ని పేస్ట్‌ రూపంలో ప్యాకెట్లుగా రూపొందించి డైపర్‌లో దాచినట్లు అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరో సంఘటనలో ఒక ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్ రూపంలో తన నడుముకు ధరించే బెల్ట్ కు అతికించాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. మరో వ్యక్తి తన పురీషనాళంలో బంగారాన్ని పేస్ట్ రూపంలో దాచుకున్నాడని అధికారులు తెలిపారు. మంగళూరు విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు ఈ ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు రూ.90.67 లక్షల విలువైన 1,606 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!