Viral News: ఒకప్పుడు ఇండియన్‌ రైల్వే లైబ్రరీలో చదువుకున్న వ్యక్తి.. నేడు ఓ దిగ్గజ కంపెనీకి సీఈవో..!

తనకు ఆ లైబ్రరీలో చదవడం ఎంత ఉపయోగపడిందో ఆయన స్వయంగా వివరించిన కథనం ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Viral News: ఒకప్పుడు ఇండియన్‌ రైల్వే లైబ్రరీలో చదువుకున్న వ్యక్తి.. నేడు ఓ దిగ్గజ కంపెనీకి సీఈవో..!
Ceo
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 18, 2023 | 5:19 PM

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో మన అరచేతిలో వాలిపోతుంది. అది మనుషులకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, జంతువులు, పక్షులు, పాములకు సంబంధించి కూడా అనేక వార్తలు వైరల్‌ అవుతుంటాయి. కొందరు ప్రముఖులు, జీవితంలో కష్టపడి అత్యున్నత స్థానాలకు ఎదిగిన పలువురి స్పూర్తిదాయక కథనాలు కూడా ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. ఓ వ్యక్తి విజయం సాధించడానికి ఎంత కష్టపడ్డాడో తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అది ఎవరో కాదు..హార్వెస్టింగ్ ఫార్మర్స్ నెట్ వర్క్ వ్యవస్థాపకుడు, సీఈవో రుచిత్ జి గార్గ్ విజయ గాద.

ఆయన ఒకప్పుడు ఇండియన్ రైల్వే లైబ్రరీలో చదువుకునేవాడట. అలా కష్టపడిన తను ఇప్పుడు హార్వెస్టింగ్ ఫార్మర్స్ నెట్ వర్క్ అనే సంస్థకు వ్యవస్థాపకుడిగా ఎదిగాడు. తనకు ఆ లైబ్రరీలో చదవడం ఎంత ఉపయోగపడిందో ఆయన స్వయంగా వివరించిన కథనం ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

సుమారు 35 సంవత్సరాల క్రితం గార్గ్‌ తన తండ్రిని కోల్పోయానని చెప్పాడు. దాంతో తన తల్లి ఇండియన్ రైల్వే లైబ్రరీలో క్లర్క్‌గా పని చేయడం ప్రారంభించింది. ఆ లైబ్రరీ అధికారులు/సిబ్బంది కోసం ఏర్పాటు చేశారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న గార్గ్‌ చదువుకోవటానికి పుస్తకాలు కూడా కొనలేని స్థితిలో ఉండేవాళ్లమని చెప్పాడు. అలాంటి సమయంలో తనకు ఆసక్తి ఉన్న అన్ని విషయాలను అక్కడి పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాను, అని అతను క్యాప్షన్‌లో రాశాడు. కాగా… ఆయన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. అతని కృషి, పట్టుదలను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

గార్గ్ కథనం ట్విట్టర్‌లో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. దీనికి దాదాపు 2 లక్షలకు పైగా వ్యూస్‌, టన్నుల కొద్దీ కామెంట్‌లు వచ్చాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..