Groom: పాపం పెళ్లికొడుకు..! రాత్రంతా కాలినడకన వెళ్లి వధువు మెడలో తాళి కట్టాడు..! ఎందుకంటే..

వరుడు, అతని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కల్యాణ్‌ సింగ్‌పూర్‌ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి కాలినడకన బయల్దేరారు. గురువారం సాయంత్రం బయల్దేరి శుక్రవారం ఉదయానికి వధువు ఇంటికి చేరుకున్నారు.

Groom: పాపం పెళ్లికొడుకు..! రాత్రంతా కాలినడకన వెళ్లి వధువు మెడలో తాళి కట్టాడు..! ఎందుకంటే..
Groom Walks All Night
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 18, 2023 | 5:11 PM

ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే, తాజాగా పెళ్లికి సంబంధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాపం ఒక వరుడు.. తన పెళ్లి కోసం నానాపాట్లు పడ్డాడు. ముహూర్త సమయానికి వధువు మెడలో తాళి కట్టేందుకు గానూ వరుడితో పాటు అతని బంధువులు సైతం రాత్రంతా కాలినడకన ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని కల్యాణ్‌ సింగ్‌పూర్‌ బ్లాక్‌ పరిధిలోని సునఖండి పంచాయతీలో నివసిస్తున్న వరుడు 28 కి.మీ దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి రాత్రంతా నడిచి మరి వధువు ఇంటికి చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలో డ్రైవర్ల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బుధవారం నుంచి ఒడిశాలో డ్రైవర్లు ఉద్యమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలను నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లికోసం ముందుగానే వాహనాలు బుక్‌ చేసుకున్నప్పటికీ యజమానులు రద్దు చేసుకున్నారు. దీంతో వరుడు, అతని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కల్యాణ్‌ సింగ్‌పూర్‌ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి కాలినడకన బయల్దేరారు. గురువారం సాయంత్రం బయల్దేరి శుక్రవారం ఉదయానికి వధువు ఇంటికి చేరుకున్నారు. పెళ్లి తంతు ముగిసింది కానీ, తిరిగి వరుడు, అతని బంధువులు పెళ్లికూతురు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. డ్రైవర్ల సంఘం సమ్మె విరమిస్తేనే వారు స్వగ్రామానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పెళ్లికూతురు ఇంట్లోనే బస చేయాలని నిర్ణయించారు. డ్రైవర్ల సమ్మె ముగిసిన తర్వాతే తిరిగి తమ గ్రామానికి వెళ్తామంటున్నారు.

ఒడిశాలో ఏక్తా మహాసంఘ్ అనే డ్రైవర్ల సంస్థ సమ్మెకు శ్రీకారం చుట్టింది. డ్రైవర్లకు సామాజిక సంక్షేమ పథకాలు అవసరమని, అందుకోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రైవర్లకు పెన్షన్, బీమా మొదలైనవి కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు వాహనాల బంద్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..