Watch: ఓరీ నీ సరదా తగలెట్టా..! భార్య కోరిందని కారులోనే ఆటలాడుతూ.. డ్రైవింగ్ గాలికోదిలేసాడు..! చివరకు..

ఈ పొరపాటు తనను ఇబ్బందులకు గురి చేస్తుందని తాను గ్రహించలేదని చెప్పాడు. అలా చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదని చేతులు జోడించి క్షమాణ కోరాడు. ఇకపై..

Watch: ఓరీ నీ సరదా తగలెట్టా..! భార్య కోరిందని కారులోనే ఆటలాడుతూ.. డ్రైవింగ్ గాలికోదిలేసాడు..! చివరకు..
Romance In Moving Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 18, 2023 | 3:16 PM

దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న జాతీయ రహదారులపై యావత్‌ దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ప్రజలు ప్రశంసిస్తున్నారు. అలాగే, రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే వారిపై కఠిన నిబంధనలు విధించడంతో పాటు జరిమానాలు కూడా విధిస్తున్నారు. కానీ, సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొందరు విన్యాసాలు చేస్తున్నారు. రోడ్లు, హైవేలపై నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేస్తూ వారితో పాటు ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో ఓ జంట రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ హైవేపై వేగంగా వెళ్తున్న కారులో రీల్స్ చేసి తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ జంట రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది.

పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏదో సరదాగా చేసిన రీల్ వీడియో ఇలా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువస్తుందని ఊహించలేదన్నాడు. రెండు వారాల క్రితం కోటా నుండి టోంక్‌కి వెళ్తున్నప్పుడు అతడు కారును అసిస్టెంట్ సిస్టమ్‌లో అంటే ఆటో మోడ్‌లోకి మార్చి హాకీ రీల్‌ను చేసినట్టుగా చెప్పాడు. కాగా, ఈ ఘటన మార్చి 1న, అతను తన భార్య నజ్మా బానోతో కలిసి టోంక్‌లోని నివాయ్‌లోని తన సోదరి ఇంటికి వెళ్తున్నాడు. కారులో వెళ్తుండగా సరదాగా ఉన్న అతడిని రీల్‌ చేయమని భార్య కోరింది. దాంతో సదరు వ్యక్తి తన కారును ఆటో మోడ్‌లో పెట్టి రీల్‌ కొట్టాడు.

ఇవి కూడా చదవండి

టోంక్‌కి SUV 700 కారులో బయల్దేరింది. టోంక్ నుండి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత రోడ్డు ఖాళీగా ఉన్న సమయంలో రీల్‌ చేసినట్టుగా చెప్పాడు. కేవలం 30 సెకన్ల వీడియో తీశామని చెప్పాడు. తన భార్య ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పొరపాటు తనను ఇబ్బందులకు గురి చేస్తుందని తాను గ్రహించలేదని చెప్పాడు. అలా చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదని చేతులు జోడించి క్షమాణ కోరాడు. ఇకపై ఆటో పైలట్ మోడ్‌లో డ్రైవ్ చేయనని చెప్పాడు. నేను తప్పు చేశాను, తప్పు చేశాను దానికి క్షమాపణలు కోరుతున్నాను.. ఇకపై అలాంటి తప్పు చేయను అంటూ తన తప్పును అంగీకరించాడు. కాగా, ఈ విధంగా కార్లు, బైక్‌లను ఆపడం మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరమని, కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస కోసం ..