AP Weather Alert : రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ హెచ్చరికలు..

ఆయా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

AP Weather Alert : రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ హెచ్చరికలు..
Rain Alert
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 17, 2023 | 7:51 PM

తెలుగు రాష్ట్రాలను అకాల వర్షం ముంచేత్తుతోంది. గురువారం నుండి పలుచోట్ల కుండపోత వానలు కురుస్తున్నాయి.. ఇదిలా ఉంటే, ఏపీలో శనివారం రోజు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్ధ ప్రకటించింది. శుక్రవారం ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రేపు కూడా పలు జిలాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ ప్రకటించింది. ఈ మేరకు..

రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్ధ తన తాజా నివేదికలో పేర్కొంది. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

అటు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..