AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులతో మామూలుగా ఉండదు మరి.. విటుల్లా వచ్చి బటుల్లా కేటుగాళ్లను పట్టేశారు..

సైబరాబాద్ రామచంద్రపురం పియస్ పరిధిలో రెండు తలల పాములను విక్రయిస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.

పోలీసులతో మామూలుగా ఉండదు మరి.. విటుల్లా వచ్చి బటుల్లా కేటుగాళ్లను పట్టేశారు..
Two Headed Snakes
Jyothi Gadda
|

Updated on: Mar 17, 2023 | 7:27 PM

Share

సైబరాబాద్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు తలల పాములను విక్రయిస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 1లక్ష 90వేల నగదు, 10 సెల్ ఫోన్స్, 2 కార్లు, రెండు తలల పాములు రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉంటూ నల్లమల అటవీ ప్రాంతం నుండి రెండు తలల పాములు తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయించే 9 మంది ముఠా గ్యాంగ్ ను రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్టుగా సమాచారం. కాగా, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో మియాపూర్ ఏసిపి నర్సింహ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు తలల పాములను పట్టుకొని ఇక్కడికి తీసుకు వచ్చి అమ్మకాలు చేస్తున్నారనే సమాచారంతో మాదాపూర్ ఎస్ ఓ టి పోలీస్, అటవీ శాఖ అధికారులు కలిసి దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుల్లో సంగారెడ్డి కి చెందిన చిన్నోల్ల మాణిక్ రెడ్డి, చిత్తూరుకు చెందిన కే. చంద్రశేఖర్, యుగంధర్, గోపాల్, ప్రసాద్, తమిళనాడు కు చెందిన V. భాస్కర్, T. నవీన్, కర్ణాటకకు చెందిన Md. బాషా, రమేష్, రాఘవేందర్, అంబర్ విజయ్, షేక్ సికిందర్ కలిసి రామచంద్రాపురం పరిధిలో పాముల అమ్మకాలు జరుపుతున్నారు.

పట్టుబడి వారి వద్ద నుండి రెండు పాములు,రూ. లక్షా 90 వేల నగదు, రెండు కార్లు, 10 మొబైల్ ఫోన్లు, ఒక తూకము మిషన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఏసీపీ నర్సింహా రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్  కోసం..

Follow Us
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ