AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏం ట్యాలెంట్‌ గురూ.. కరెంట్‌ లేకుండానే బావిలోంచి నీళ్లు తోడేస్తున్నాడు

ఆ టైరుకే నీళ్ల పైప్‌ను తొడిగించాడు. దాని ద్వారానే నీటిని పైకి తీసుకురావడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూస్తే బాలుడి ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Viral Video: ఏం ట్యాలెంట్‌ గురూ.. కరెంట్‌ లేకుండానే బావిలోంచి నీళ్లు తోడేస్తున్నాడు
Ultimate Jugad
Jyothi Gadda
|

Updated on: Mar 17, 2023 | 7:03 PM

Share

మనదేశం జుగాడు పౌరులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జుగాడ్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడంలో భారతీయులది చాలా ప్రత్యేకమైన శైలి. ఈ నేపథ్యంలో కొంతమంది దేశీ జుగాడ్ ‘లతో ప్రపంచమే ఔరా అనేలా చేస్తున్నారు.. ప్రస్తుతం, సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో ఒకటి ప్రజల దృష్టిని ఆకర్షించింది. సదరు వీడియోలో ఒక వ్యక్తి జుగాడ్ తో టైర్లు, చిన్న వాటర్‌ పైపుతో ఒక ప్రత్యేకంగా తయారు చేసిన చేతిపంపు నుంచి చెరువులోంచి ఈజీగా నీటిని తోడుకుంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌ వేధికగా ఈ వీడియో వైరల్‌గా మారింది.

వీడియోలో, జుగాడ్‌ ఆలోచన ప్రజలకు ఎలా సహాయపడుతుందో, వారి జీవితాల్లో పనులను ఎలా సులభతరం చేస్తుందో చూడవచ్చు. వీడియోలో, కొంతమంది వ్యక్తులు కలిసి ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చెరువు నుండి నీటిని తోడేస్తున్నారు. ఓ బాలుడు ఒక పొడవాటి కర్ర, టైరు, చిన్న వాటర్ పైపుతో ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేయడం గమనించవచ్చు. దాని సహాయంతో కరెంట్ అక్కర్లేకుండానే ఒక నీటిగుంట నుంచి నేరుగా నీటిని తోడి తమ వద్ద ఉన్న చిన్న చిన్న వాటర్ ట్యాంకుల్లోకి నింపేసుకుంటున్నారు. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పొడవాటి కర్రకు ఒకవైపు బరువును, మరోవైపు టైరును బిగించాడు. ఆ టైరుకే నీళ్ల పైప్‌ను తొడిగించాడు. దాని ద్వారానే నీటిని పైకి తీసుకురావడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూస్తే బాలుడి ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఇవి కూడా చదవండి

నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటికే 4లక్షలకు పైగా వ్యూస్, 5వేల పైగా లైకులు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘వెరీ గుడ్ స్కిల్స్’ అని ఇంకొందరు.. క్లేవర్ ఐడియా అని మరికొందరు, ‘జీనియస్’ అంటూ ఇంకొందరు బాలుడిని పొగుడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..