AP CET’s Schedule: ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల-2023 షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 17న ఉన్నత విద్యా మండలి విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 17న ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌లకు మార్చి 18 నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి సందర్భంగా ప్రకటించింది. వీటన్నింటికీ మార్చిలో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
షెడ్యూల్ ప్రకారం..
- పీజీఈసెట్-2023 పరీక్ష నోటిఫికేషన్ మార్చి 19న విడుదలవుతుంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మే 28 నుంచి 30 వరకు పరీక్ష జరుగుతుంది.
- లాసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 21న విడుదలవుతుంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 20న పరీక్ష జరుగుతుంది.
- ఎడ్‌సెట్-2023 నోటిపికేషన్ మార్చి 22న విడుదలవుతుంది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుది. మే 20 న ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
- పీఈసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 18న విడుదలవుతుంది. మార్చి 23 నుంచి మే 10 వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష మే 31న జరుగుతుంది.
- పీజీసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 29న విడుదలవుతుంది. ఏప్రిల్ 1 నుంచి మే 11 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. జూన్ 6 నుంచి 10 వరకు పరీక్ష జరుగుతుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.