Andhra Pradesh: శ్రీసిటీ ప్లాంట్‌లో కమర్షియల్ ఏసీల ఉత్పత్తిని ప్రారంభించిన హావెల్స్ కంపెనీ..

ప్రముఖ గృహోపకరణాల కంపెనీ హావెల్స్ ఇండియా లిమిటెడ్ శుక్రవారం(మార్చి 17) నుండి శ్రీసిటీ ప్లాంట్‌లో ఎయిర్ కండీషనర్ల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది.

Andhra Pradesh: శ్రీసిటీ ప్లాంట్‌లో కమర్షియల్ ఏసీల ఉత్పత్తిని ప్రారంభించిన హావెల్స్ కంపెనీ..
Havells
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 17, 2023 | 9:03 PM

ప్రముఖ గృహోపకరణాల కంపెనీ హావెల్స్ ఇండియా లిమిటెడ్ శుక్రవారం(మార్చి 17) నుండి శ్రీసిటీ ప్లాంట్‌లో ఎయిర్ కండీషనర్ల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది కంపెనీ. ఏపీలోని శ్రీసిటీలో ప్లాంట్‌లో ఈ ఏసీల ఉత్పత్తిని ప్రారంభించింది కంపెనీ.

1985లో స్థాపించబడిన హావెల్స్.. గృహోపకరణాలు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం లైటింగ్, LED లైటింగ్, ఫ్యాన్‌లు, మాడ్యులర్ స్విచ్‌లు, వైరింగ్ ఉపకరణాలు, వాటర్ హీటర్లు, సర్క్యూట్ సేఫ్టీ స్విచ్‌గేర్, కేబుల్స్, వైర్లు, ఇండక్షన్ మోటార్లు తయారు చేస్తుంది.

నోయిడా ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న కంపెనీ.. దేశ వ్యాప్తంగా ఏపీతో పాటు 7 తయారీ యూనిట్లను కలిగి ఉంది. విదేశాల్లో చైనా, యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో తయారీ యూనిట్లతో 50 దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా ఉనికిని కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..