Big News Big Debate: రాజకీయ ఓటు పాట్లు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పార్టీల పోస్టుమార్టం
ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు మిశ్రమంగా వస్తున్నాయి. స్థానికసంస్థలు, ఉపాధ్యయ ఎన్నికల్లో అధికారపార్టీ స్వీప్ చేస్తే.. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆధిక్యంలో ఉంది. స్థానిక సంస్థల్లో బలం ఉంది..
ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు మిశ్రమంగా వస్తున్నాయి. స్థానికసంస్థలు, ఉపాధ్యయ ఎన్నికల్లో అధికారపార్టీ స్వీప్ చేస్తే.. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆధిక్యంలో ఉంది. స్థానిక సంస్థల్లో బలం ఉంది.. ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగం అందుకే ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని.. ప్రజాబలం మాత్రం తమకే ఉందని గ్రాడ్యుయేట్స్ తీర్పు అద్దం పడుతుందని టీడీపీ చెప్పుకుంటోంది. ఉత్తరాంధ్రలో బీజేపీ సిట్టింగ్ సీటు లాస్ కాగా… లెఫ్ట్ మద్దతున్న పీడీఎఫ్ టీచర్ స్థానాలు కోల్పోయింది. AP ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పట్టభద్రులు, టీచర్లు, ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లోనూ డబ్బు, మద్యం యధేచ్చగా పంచారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు కొందరు అభ్యర్థులు. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు వచ్చిన ఈ పోటీని సెమీ ఫైనల్స్‌గా ప్రకటించిన పార్టీలు ఫలితాలపై పోస్టమార్టం మొదలెట్టాయి. స్థానిక సంస్థలు, టీచర్స్ నియోజకవర్గాల్లో అధికారపార్టీ ఏకపక్ష విజయాలు వైసీపీ కేడర్‌లో ఉత్సాహం నింపాయి. మొత్తం 9 స్థానాలకు నోటిఫకేషన్ రాగా.. అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరులో ఏకగ్రీవం అయ్యాయి. వెస్ట్ గోదావరిలో రెండు, కర్నూలు, శ్రీకాకుళంలో ఎన్నికలు జరగ్గా అక్కడా విజయం సాధించింది వైసీపీ. ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా టీచర్లలో బలమైన వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆ వర్గాలు కూడా అధికారపార్టీ మద్దతిచ్చిన అభ్యర్ధులను గెలిపించడం ఆసక్తి రేపుతోంది.
వైసీపీ స్వీప్ చేసినా..
మిగతా అంశాలు ఎలా ఉన్నా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే అత్యంత కీలకంగా భావించిన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. 9 జిల్లాల్లోని 108 నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో రెండు నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఆధిక్యం ఆ పార్టీలో నూతనోత్సాహానిచ్చింది. విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పినా అక్కడ తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యత ఓటులో మెజార్టీ సాధించింది. అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేసిన వైసీపీ రాయలసీమలోనూ ఎదురీదుతోంది. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఇదే ఊపులో 2024లో స్వీప్ చేస్తామంటూ తెలుగుదేశం నేతలు సవాళ్లు విసురుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయన్నారు సీనియర్ నేత యనమల. ఈ ఎన్నికల్లో బీజేపీ తన ఉనికిని కాపాడుకోవడంలో విఫలం కాగా.. లెఫ్ట్ పార్టీల మద్దతు ఉన్న పీడీఎఫ్ అభ్యర్ధులు కూడా వెనకపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిజంగానే 2024 ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించాలా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..