AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Assembly: ఏపీ సభాపర్వం రసాబాసా.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

ఈ క్రమంలో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేశారు. సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు.

AP Assembly: ఏపీ సభాపర్వం రసాబాసా.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
Andhra Pradesh Assembly
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2023 | 1:55 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే సభలో రసాబాసా కొనసాగుతోంది. దీంతో టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై చర్చకు డిమాండ్‌ చేస్తూ టీడీపీ సభ్యులు ఈ ఉదయం వాయిదా తీర్మానమిచ్చారు. వెంటనే దానిపై చర్చ చేపట్టాలని సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన గురించి చర్చించాల్సి వస్తే గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా చేసిన పర్యటనల గురించి కూడా చర్చించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. సీఎం పర్యటనపై వాయిదా తీర్మానం ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని బుగ్గన తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేశారు. సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు.

టీడీపీ సభ్యుల దగ్గర మాట్లాడేందుకు సబ్జెక్టు లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు. రోజు రావడం సభలో గందరగోళం చేయడం అలవాటుగా మారిందని అన్నారు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని బుగ్గన తప్పుబట్టారు. లంచ్‌ టైమ్‌ కాగానే సభలో గొడవ చేయడమన్నది టీడీపీ సభ్యులు అలవాటుగా పెట్టుకున్నారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన విమర్శించారు. చక్కగా విశ్రాంతి తీసుకొని సాయంత్రం మీడియా ముందుకు వస్తారని అన్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు.

అంతకు ముందు సభ ప్రాంగణంలో భారీ బ్యానర్‌ పట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేలు నిరనస చేపట్టారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ద్వారా ఏం సాధించారని ప్రశ్నించారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అంత అర్జెంటుగా ఢిల్లీ వెళ్లి సీఎం ఏం తెచ్చారని ప్రశ్నించారు. కేసుల్లో సీబీఐ ముందు అడుగు వేస్తే సీఎంకు ఢిల్లీ గుర్తుకు వస్తుందని అన్నారు. ఇప్పటి వరకు జరిపిన పర్యటనలన్నీ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..