AP: క్షణక్షణం ఉత్కంఠ.. దోబూచులాడుతున్న విజయం.. ప్రజంట్ లీడ్‌లో ఉన్నది ఎవరంటే..?
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు క్షణంక్షణం ఉత్కంఠ రేపుతుంది. ప్రజంట్ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది.
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ కౌంటింగ్ టెన్షన్ పుట్టిస్తోంది. రౌండ్‌రౌండ్‌కీ మెజారిటీలు మారిపోతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య విజయం దోబూచులాడుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ 50శాతం ఓట్లు దక్కకపోవడంతో.. ప్రజంట్ రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 2,26,448 ఓట్లు చెల్లుబాటు అవ్వగా… వైసీపీ అభ్యర్ధికి రవీంద్రారెడ్డికి 95,969 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి రామగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు వచ్చాయి. 11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డికి మెజారిటీ తగ్గుతూ వస్తుంది. ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 33 మంది అభ్యర్ధుల ఎలిమినేషన్ జరిగింది. ఓవరాల్‌గా రెండవ ప్రాధాన్యత ఓట్లను కూడా కలుపుకుని ప్రస్తుత డేటాను బట్టి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి పోలైన ఓట్లు 96,436 కాగా.. టీడీపీ అభ్యర్ధి రామగోపాల్ రెడ్డికి 94,717 పోలాయ్యాయి. ప్రస్తుతానికి 1719 ఓట్ల మెజారిటీతో ఉన్నారు వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి.
మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సక్రమంగా జరగడం లేదన్నారు వైసీపీ లీడర్ విశ్వేశ్వర్‌రెడ్డి. వైసీపీ ఓట్లను టీడీపీ కట్టల్లో కట్టేశారనే అనుమానాలు వ్యక్తంచేశారు. వైసీపీ అభ్యర్ధి రవీంద్రారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అధికారులు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్రెడీ జెండా ఎగరేసింది టీడీపీ. ఉత్తరాంధ్రలో విజయం సాధించిన చిరంజీవిరావు, తూర్పు రాయలసీమలో గెలిచిన కంచర్ల శ్రీకాంత్… విజయోత్సవాలు చేసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..