AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: జుట్టు పాడైపోయిందని బాధపడుతున్నారా..? ఇలా జీవం పోయండి..

రసాయన చికిత్సలను నివారించండి. హీట్ స్టైలింగ్ సాధనాలు మీ జుట్టుకు హాని కలిగించే ప్రమాదం ఉంది. అయితే, ఈ పరిస్థితిలో జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని తప్పనిసరి నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. దాంతో తిరిగి మీ జుట్టుకు జీవం పోయగలుగుతారు..

Hair Care Tips: జుట్టు పాడైపోయిందని బాధపడుతున్నారా..? ఇలా జీవం పోయండి..
Hair Care
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2023 | 4:06 PM

Share

ప్రస్తుతకాలంలో జుట్టు సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. జుట్టు రాలిపోవడం, పొడిబారడం, బట్టతల సమస్యలతో అనేకమంది బయటకు వెళ్లేందుకు ఇబ్బందిగా భావిస్తున్నారు. జుట్టు సమస్యలకు ప్రధానంగా ఎండ, దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు తరచుగా బలహీనంగా మారుతుంది. దీంతో జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. తరచూ చుండ్రు సమస్యలు కూడా వేధిస్తుంటాయి. మన జుట్టు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, స్టైల్‌గా మలిచేందుకు వాడే, స్ట్రెయిటనర్స్, రసాయనాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. అయితే, ఈ పరిస్థితిలో జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని తప్పనిసరి నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. దాంతో తిరిగి మీ జుట్టుకు జీవం పోయగలుగుతారు..

డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్‌ని ఉపయోగించండి. వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్ మీ జుట్టుకు అవసరమైన తేమను అందించడంలో సహాయపడుతుంది. అవకాడో నూనె, కొబ్బరి నూనె లేదా తేనె వంటి సహజ పదార్ధాలను కలిగి ఉన్న ఉత్పత్తులను మీ జుట్టుకు ఉపయోగించండి. మీ జుట్టును క్రమం తప్పకుండా కొనలు కత్తిరిస్తూ ఉండాలి.. ట్రిమ్ కోసం ప్రతి ఆరు నుండి ఎనిమిది వారాలకు మీ హెయిర్‌స్టైలిస్ట్‌ని మార్చేస్తుండాలి. హీట్ స్టైలింగ్‌ను నివారించండి. హీట్ స్టైలింగ్ సాధనాలు మీ జుట్టుకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ఇది జుట్టును పొడిగా మార్చుతుంది. చివర్లు చిట్లిపోయేలా చేస్తాయి. దాంతో మీ జుట్టు పెరుగుదల దెబ్బతింటుంది.

మీరు ఉపయోగించే దువ్వెనకు విశాలమైన దంతాలు ఉండేలా చూసుకోండి. అలాంటి దువ్వెనతో మీ జుట్టు చిక్కులు ఈజీగా విడిపోతాయి. మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు ఉపయోగించేందుకు, చిక్కుముడులను నివారించడంలో సహాయపడటానికి వెడల్పాటి-పంటి దువ్వెన లేదా డి-టాంగ్లింగ్ బ్రష్‌తో బ్రష్ చేయండి. రసాయన చికిత్సలను నివారించండి. పెర్మ్స్, రిలాక్సర్‌లు, కలరింగ్ వంటి హెయిర్ ట్రీట్‌మెంట్‌లు మీ జుట్టుకు హాని కలిగిస్తాయి. వీలైతే వాటిని నివారించండి. లేదంటే మంచి నాణ్యమైన ఉత్పత్తులను ఉపయోగించండి

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. విటమిన్లు ఏ, సీ, డీ, ఈ, జింక్, బయోటిన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మీరు తినే ఆహారంలో ఆకు కూరలు, పుల్లటి పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, అవకాడో, బీన్స్ వంటి ఏదో రూపంలో ఉండేలా చూసుకోవటం మీకు జుట్టుతో పాటు మీ పూర్తి ఆరోగ్యానికి ఎంతో అవసరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..