Baldness: మగవారికే బట్టతల ఎందుకు వస్తుంది…? ఆడవారికి ఎందుకు రాదు.. రీజన్ ఇదే

అసలు ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? మగవారికే ఎందుకు బట్టతల వస్తుంది. దీనికి వెనుక ఉన్న కారణాలు ఏంటి..?

Baldness: మగవారికే బట్టతల ఎందుకు వస్తుంది...? ఆడవారికి ఎందుకు రాదు.. రీజన్ ఇదే
Baldness
Follow us

|

Updated on: Mar 19, 2023 | 3:17 PM

మగవారికే బట్టతల ఎందుకు వస్తుంది…? అసలు ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? బట్టతల ఉన్న ఆడవారిని మనం ఎప్పుడూ చూసి ఉండం. మగవారికి అయితే అదేదో షేవ్ చేసినట్లు తల అంతా ఊడిపోయి.. క్రికెట్ గ్రౌండ్ మాదిరి మారిపోతుంది. జుట్టు అనేది మనకు మాగ్జిమమ్ జీన్స్‌పై ఆధారపడి ఉంటుంది. అలాగే యాండ్రోజనిక్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ప్రధానంగా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్లకి వృషణాల నుంచి విడుదలయ్యే టెస్టోస్టెరాన్ హార్మోన్, అలానే కిడ్నీలపై ఉండే ఎడ్రినల్ గ్రంథులు విడుదల చేసే.. హార్మోన్స్ అవసరానికి మించి ఉత్పత్తి అయినప్పుడు.. జుట్టు కుదుళ్లు కృషించుకుపోతాయ్. వీటివల్ల మగవారికి బట్టతల ఎక్కువ వస్తుంది. కుదుళ్లు పాడవ్వడం వల్ల కొత్త జుట్టు కూడా అక్కడ వచ్చే ఆస్కారం ఉండదు. కోపం వచ్చినప్పుడు, భయందోళలకు గురయినప్పుడు, బాగా కంగారు పడినప్పుడు, బాగా స్ట్రెస్‌కి, ఇరిటేషన్‌కి గురయినప్పుడు.. కిడ్నీలపై ఉండే గ్రంథుల నుంచి  హార్మోన్స్ విడుదలవుతాయి. అలాగే మగవారిలో శృంగార కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు.. టెస్టోస్టెరాన్ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే మగవారికి ఎక్కువగా బట్టతల వస్తుంది.

ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే.. కిడ్నీలపై ఉండే గ్రంథులు వారికీ ఉంటాయ్.. కానీ..  వారికి ఓర్పు ఎక్కువ. కూల్‌గా, కామ్‌గా ఎక్కువగా ఉంటారు. మగవారితో పోల్చితే ఆడవారికి స్ట్రెస్ తక్కువ అని చాలా నివేదికలు సైతం చెబుతున్నాయి. అందుకే కిడ్నీలపై ఉండే గ్రంథులు యాండ్రోజనిక్ హార్మోన్స్‌ను ఎక్కువగా ప్రొడ్యూస్ చెయ్యవు. అందుకే వారు సేఫ్.

అందుకే అబ్బాయిలు కాస్త ఆ ఆలోచనలు అదుపు చేసుకోండి. కొంచెం నీరు ఎక్కువ తాగండి అని ప్రముఖ వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు చెబుతున్నారు. అలాగే బాడీలో ఐరన్, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి కూడా మెండుగా ఉండేలా చూడాలని సూచిస్తున్నారు. ఇక మంచి ప్రొటీన్ ఫుడ్ తింటేనే.. హెయిర్ స్ట్రాంగ్‌గా ఉంటుందని ఆయన చెబుతున్నారు. కాస్త బాడీకి ఎండ తగిలేలా చూడాలని సలహా ఇస్తున్నారు మంతెన. అప్పుడే విటమిన్ డి, విటమిన్ 12 బాడీకి అంది.. జుట్టు మంచిగా పెరుగుతుందని వివరించారు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. మీరు అనుమానాలు నివృత్తి చేసుకోడానికి వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..