Weight Loss Tips: ఈ ఆహారం తీసుకోండి.. అధిక బరువుకు చెక్ చెప్పండి.. సమ్మర్లో ఇదే బెస్ట్ డైట్..

మీకు వేసవిలో డైట్ అనగానే యాపిల్స్, నారింజ, బేరి, దోసకాయలు మొదలైన వాటిని తినమని అందరూ చెబుతారు. కానీ వీటికన్నా ఎఫెక్టివ్ పనిచేసే ఐదు ఆహార పదార్థాలను నిపుణుల సూచనలతో మీకు పరిచయం చేస్తున్నాం.

Weight Loss Tips: ఈ ఆహారం తీసుకోండి.. అధిక బరువుకు చెక్ చెప్పండి.. సమ్మర్లో ఇదే బెస్ట్ డైట్..
Weight Loss
Follow us
Madhu

|

Updated on: Mar 18, 2023 | 4:30 PM

ప్రస్తుత సమాజంలో అత్యధిక శాతం మందికి ఎదురవుతున్న ప్రధాన సమస్య అధిక బరువు. నిజమే శారీరక శ్రమ లేని జీవన విధానం వల్ల చాలా మంది ఊబకాయులైపోతున్నారు. దీంతో బరువును తగ్గించుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. రకరకాల డైట్లు, అనేక విధాన వ్యాయామాలు చేస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సులభంగా మీరు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో శరీరంలోని అధిక కొవ్వును నియంత్రించుకోవడం సులభం. అందుకే టాప్ 5 ఆహార పదార్థాలను మీకు పరిచయం చేస్తున్నాం. ఇవి బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తాయి. మీకు వేసవిలో డైట్ అనగానే యాపిల్స్, నారింజ, బేరి, దోసకాయలు మొదలైన వాటిని తినమని అందరూ చెబుతారు. కానీ వీటికన్నా ఎఫెక్టివ్ పనిచేసే ఐదు ఆహార పదార్థాలను నిపుణుల సూచనలతో మీకు పరిచయం చేస్తున్నాం. ఆ వెయిట్ లాస్ ఫుడ్స్ఏంటో చూద్దాం రండి..

ఉడికించిన గుడ్లు.. ఉడకబెట్టిన గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. గుడ్లు ఆకలిని తగ్గిస్తాయి. మీ కడుపు ఎక్కువ కాలం నిండుగా ఉండేటట్లు చేస్తాయి. కాబట్టి వీటిని అల్పాహారంలో తీసుకోవడం, మీ బరువు తగ్గడానికి మంచి ఆరంభం అవుతుంది.

స్మూతీస్.. జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, స్మూతీస్ లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటి కారణంగా బరువు తగ్గుతారు. రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం వీటిని వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలతో తయారు చేయవచ్చు. అరటిపండు బాదం స్మూతీని ప్రయత్నించవచ్చు. ఇది మీ వేసవి దాహాన్ని కూడా తీర్చుతుంది.

ఇవి కూడా చదవండి

వేయించిన చిక్పీస్.. బరువు తగ్గడానికి మరొక ఆరోగ్యకరమైన ఆహారం కాల్చిన చిక్‌పీస్. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, మంచి కొవ్వులు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. అలాగే, ఈ లక్షణాలన్నీ బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది.

బ్రోకలీ.. బ్రోకలీ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. బ్రోకలీలో తక్కువ క్యాలరీలు,అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అదనంగా, ఇందులో ఉండే అధిక ఐరన్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శక్తి స్థాయిలను పెంచుతాయి. రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి.

డిటాక్స్ డ్రింక్స్.. యాపిల్స్, బీట్‌రూట్ మరియు క్యారెట్‌లను కలిపి డిటాక్స్ పానీయాన్ని తయారు చేయవచ్చు. ఈ మూడు పదార్థాలను కలిపి ఒక రుచికరమైన పానీయాన్ని తయారు చేయవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..