Coronavirus Vaccine: ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయం.. అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్..

Covid-19 Vaccine - Maharashtra: దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా అందించేందుకు

Coronavirus Vaccine: ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయం.. అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్..
Coronavirus Vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 25, 2021 | 4:22 PM

Covid-19 Vaccine – Maharashtra: దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా అందించేందుకు ఆయా రాష్ట్రప్రభుత్వాలు సన్నహాలు చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలకు ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు వెల్లడించాయి. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ.. ఉచితంగానే వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆదివారం వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర కేబినెట్‌ చర్చించిందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి త్వరలోనే అవసరమైన టెండర్లను పిలుస్తామని వెల్లడించారు. కాగా మే 1 నుంచి మొబైల్ వ్యాన్‌ల ద్వారా వ్యాక్సిన్ అందించేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

దేశంలో మహారాష్ట్రలోనే కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి మహారాష్ట్రలో రోజువారీగా 60వేలకు పైగా కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో త్వరలోనే కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశముందని మంత్రి ఆదిత్య ఠాక్రే ఇటీవలనే పేర్కొన్నారు. అయితే ఇది సెకండ్ వేవ్ కంటే బలంగా ఉంటుందా.. బలహీనంగా ఉంటుందా అనేది ఇప్పుడే నిర్ణయించలేమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వెంటనే ప్రభావం చూపించకపోయినా.. వ్యాప్తికి అడ్డుకట్టవేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

ఇదిలాఉంటే.. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మే 1 నుంచి.. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అందరూ కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.

Also Read:

Babul Supriyo: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకి రెండోసారి కరోనా పాజిటివ్..

కోవిడ్ వార్డే మ్యారేజ్ హాలుగా మారిన వేళ, వరుడికి పాజిటివ్, చెదరని వధువు, కేరళలో విచిత్రం

మహాభారతం కాలం నాటి ఆలయం.. కంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్మకం
మహాభారతం కాలం నాటి ఆలయం.. కంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్మకం
రాజాసాబ్ రొమాంటిక్ అప్డేట్.. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సామ్ రివ్యూ
రాజాసాబ్ రొమాంటిక్ అప్డేట్.. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సామ్ రివ్యూ
"మహా" సీఎం దాదాపు ఖరారు.. ప్రకటనే తరువాయి..!
ఏపీలో నార్మలైజేషన్ లేకుండా DSC ఆన్‌లైన్‌ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?
ఏపీలో నార్మలైజేషన్ లేకుండా DSC ఆన్‌లైన్‌ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?
బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఎవరి కుట్ర? ABT, జమాత్ లక్ష్యం హిందువులేనా
బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఎవరి కుట్ర? ABT, జమాత్ లక్ష్యం హిందువులేనా
తెలంగాణ రైతులకు రేపో.. మాపో గుడ్‌ న్యూస్‌..!
తెలంగాణ రైతులకు రేపో.. మాపో గుడ్‌ న్యూస్‌..!
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? నేరగాళ్లు ప్రజలను ఎలా మోసగిస్తున్నారు
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? నేరగాళ్లు ప్రజలను ఎలా మోసగిస్తున్నారు
ఆ హీరోతో నటించాడనికి చాలా భయపడ్డాను ..
ఆ హీరోతో నటించాడనికి చాలా భయపడ్డాను ..
చెర్రీతో కన్నడ దర్శకుడు మూవీ.. నెపోటిజంపై కృతి సనన్‌ వ్యాఖ్యలు..
చెర్రీతో కన్నడ దర్శకుడు మూవీ.. నెపోటిజంపై కృతి సనన్‌ వ్యాఖ్యలు..
గింజలే అని చిన్న చూపు చూడకండి.. రోజుకో స్పూన్ తింటే అమేజింగ్ అంతే
గింజలే అని చిన్న చూపు చూడకండి.. రోజుకో స్పూన్ తింటే అమేజింగ్ అంతే