AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎం కేర్స్ ఫండ్ నిధులతో దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు, కేంద్రం వెల్లడి

తీవ్రమవుతున్న ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు దేశ వ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేయాలని  కేంద్రం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పీఎం కేర్స్ ఫండ్ నిధులతో దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు, కేంద్రం వెల్లడి
oxygen plants
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Apr 25, 2021 | 5:19 PM

Share

తీవ్రమవుతున్న ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు దేశ వ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేయాలని  కేంద్రం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత  త్వరగా వీటిని నెలకొల్పాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఈ బీభత్స పరిస్థితుల్లో ఎంత త్వరగా వీటిని ఏర్పాటు చేస్తే అంత మంచిదని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ లోని వివిధ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరతను ఆయన ప్రస్తావించారు,  కాగా-అదనంగా 162 ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పీఎం కేర్స్ ఫండ్ ఈ ఏడాది ఆరంభంలో రూ. 201.58 కోట్లు కేటాయించింది. వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోకుండా చూసేందుకు ఈ ప్లాంట్లు తోడ్పడుతాయని భావిస్తున్నారు.

తద్వారా కోవిద్ రోగులకు ఆక్సిజన్ నిరంతరం అందగలుగుతుంది. ప్రధాని నేటి తన ‘మన్ కీ బాత్’ లో ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం యుధ్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేబడుతోందని తెలిపారు. పరిస్థితి తీవ్రతను తాము గుర్తించామన్నారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ల విషయంలో వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలను కోరారు. అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ ను పంపుతున్నామని, మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. కార్పొరేట్ రంగం కూడా ఇనాక్యులేషన్ డ్రైవ్ లో పాల్గొనాలని, ఈ రంగ ఉద్యోగులు సైతం  వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. సమిష్టిగా  కలిసి ఈ మహమ్మారిని తరిమి కొడదామని మోదీ పేర్కొన్నారు.  త్వరలో మరికొన్ని టీకామందులు అందుబాటులోకి రానున్నాయని, తాము వివిధ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో చర్చలు జరిపామని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఆక్సిజన్ ఉత్పాదక కంపెనీలతో కూడా  చర్చించామన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: పరిశ్రమలపై మళ్లీ కరోనా పిడుగు.. ప్లాస్టిక్‌, సిమెంట్‌, స్టీల్‌ ధరలకు రెక్కలు..కోవిడ్‌తో ముడిసరుకుపై తీవ్ర ప్రభావం

Corona Pandemic: మాస్క్ లు ధరించండి బాబులూ అంటూ సల్మాన్ రాధే సినిమా ట్రైలర్ ను వాడేసిన ముంబయి పోలీసులు.. సూపర్ అంటున్న నెటిజనం!