పరిశ్రమలపై మళ్లీ కరోనా పిడుగు.. ప్లాస్టిక్‌, సిమెంట్‌, స్టీల్‌ ధరలకు రెక్కలు..కోవిడ్‌తో ముడిసరుకుపై తీవ్ర ప్రభావం

Corona Effect on Industries: గత ఏడాది లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే పరిశ్రమలపై మరోసారి కరోనా పంజా విసురుతోంది. పెరుగుతున్న కరోనా కేసులు, మళ్లీ లాక్‌డౌన్‌..

పరిశ్రమలపై మళ్లీ కరోనా పిడుగు.. ప్లాస్టిక్‌, సిమెంట్‌, స్టీల్‌ ధరలకు రెక్కలు..కోవిడ్‌తో ముడిసరుకుపై తీవ్ర ప్రభావం
Corona Effect
Follow us
Subhash Goud

|

Updated on: Apr 25, 2021 | 5:07 PM

Corona Effect on Industries: గత ఏడాది లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే పరిశ్రమలపై మరోసారి కరోనా పంజా విసురుతోంది. పెరుగుతున్న కరోనా కేసులు, మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారేమోన్న భయంతో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. మరోవైపు దిగుమతులు నిలిచిపోవడంతో ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్‌ ధరలు రెట్టింపు అయ్యాయి. సిమెంట్‌, స్టీల్‌ రేట్లు భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని ప్లాస్టిక్‌ పరిశ్రమలకు గుజరాత్‌, మహారాష్ట్రలోని రిలయన్స్‌, గెయిల్‌ సంస్థల నుంచే ఎక్కువగా ముడిసరుకు దిగుమతి అవుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో కార్మికులు స్వరాష్ట్రాల బాట పట్టారు. దీంతో అక్కడ ఉత్పత్తితో పాటు రవాణా కూడా తగ్గిపోవడంతో ప్లాస్టిక్‌ ముడిసరుకుకు రెచ్చలొచ్చాయి. గతంలో రూ.8వేలు ఉన్న టన్ను ప్లాస్టిక్‌ ధర ఇప్పుడు ఏకంగా రూ.15వేలకు పరుగెత్తింది.

గత ఏడాది మార్చిలో మొదలైన లాక్‌డౌన్‌ నుంచే పలు పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవడం, పరిశ్రమలు దాదాపు ఆరు నెలల పాటు మూత పడటంతో చిన్నాచితకా పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. బ్యాంకు రుణాలు చెల్లించే స్థోమతలేక పోవడంతో పాటు నిలిచిపోయిన పరిశ్రమలను మళ్లీ పట్టాలెక్కించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.

ఉద్యోగులను, వేతనాలను కుదించి.. టెక్నాలజీని ఉపయోగించి

ఉద్యోగులను, వేతనాలను కుదించడం, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం, లేబర్‌పై ఆధారపడటం తగ్గించి టెక్నాలజీ వినియోగం పెంచడం, విక్రయాలు పెంచుకునేందుకు మార్కెటింగ్‌కు ఎక్కువ ఖర్చు చేయడం తదితర చర్యలతో నష్టాలను అధిగమించేందుకు పరిశ్రమ వర్గాలు కృషి చేస్తున్నాయి. కానీ మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మళ్లీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో పరిశ్రమవర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.

స్టీల్‌ ఉత్పత్తికి ఆక్సిజన్‌ బంద్‌

ఉక్కు తయారీ పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేయడం తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం మరింత పెరిగింది. దీంతో స్టీల్ పరిశ్రమలకు సరఫరాను నిలిపివేశారని, దీంతో ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

గతంలో రూ.42 వేలు పలికిన టన్ను ఉక్కు.. ఇప్పుడు ఏకంగా రూ.50 వేలకు చేరినట్లు తెలుస్తోంది. మరో వైపు సిమెంట్‌ ధరలు కూడా టన్నుకు దాదాపు రూ.1500 వరకు పెరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లో పని చేస్తున్న ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల కార్మికులు క్రమంగా తమ స్వస్థలాలకు వెళ్లిపోతుండటంతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి: Acer Laptop: భారత్‌లో తొలిసారిగా 5జీ ల్యాప్‌టాప్ విడుదల.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..?

Post Office Monthly Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితే నెలకు రూ.5 వేల రాబడి పొందవచ్చు