Acer Laptop: భారత్‌లో తొలిసారిగా 5జీ ల్యాప్‌టాప్ విడుదల.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..?

Acer Spin 7 Laptop: భారత్‌లో కొత్త 5జీ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. అదే ఏసర్‌ స్పిన్‌7. ఇందులో 14 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డిప్‌ప్లేను అందించారు. 360 డిగ్రీల కోణంలో ఈ డిస్‌..

Acer Laptop: భారత్‌లో తొలిసారిగా 5జీ ల్యాప్‌టాప్ విడుదల.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..?
Acer Laptop
Follow us

|

Updated on: Apr 24, 2021 | 10:32 PM

Acer Spin 7 Laptop: భారత్‌లో కొత్త 5జీ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. అదే ఏసర్‌ స్పిన్‌7. ఇందులో 14 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డిప్‌ప్లేను అందించారు. 360 డిగ్రీల కోణంలో ఈ డిస్‌ ప్లే తిరగనుంది. అయితే మన దేశంలో మొదటి 5జీ ల్యాప్‌టాప్‌ ఇదేనని ఏసర్‌ చెబుతోంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8సీఎక్స్ జెన్ 2 5జీ ప్లాట్‌ఫాంను అందించారు.

ధర ఎంతంటే..?

దీని ధర మనదేశంలో రూ.1,34,999గా ఉంది. ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఏసర్ ఆన్ లైన్ స్టోర్, ఇతర భాగస్వామ్య స్టోర్లలో ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేయవచ్చు. కాగా, ఈ ల్యాప్‌టాప్‌ స్టీమ్ బ్లూ రంగులో అందుబాటులో ఉంది. కేవలం ఒక్క కలర్ వేరియంట్ మాత్రమే ఇందులో విడుదల చేసింది ఏసర్‌.

స్పెసిఫికేషన్లు..

ఇందులో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టచ్ డిస్ ప్లే ఉండగా, 250 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇది అందిస్తుంది. దీని డిస్ ప్లేను 360 డిగ్రీల కోణంలో తిప్పుకునే సదుపాయం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8సీఎక్స్ జెన్ 2 5జీ కంప్యూట్ ప్లాట్‌ఫాం ద్వారా క్వాల్ కాం క్రియో 495 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్ టాప్ పనిచేయనుంది. దీని ఫ్రీక్వెన్సీ 3.0 గిగాహెర్ట్జ్‌గా ఉంది. అలాగే గ్రాఫిక్స్ కోసం క్వాల్ కాం అడ్రెనో 685 జీపీయూని అందించనున్నారు. 8 జీబీ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. విండోస్ 10 ప్రో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ ల్యాప్ టాప్ మిల్లీమీటర్ వేవ్, సబ్-6 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలను సపోర్ట్ చేయనుంది.

అంతేకాకుండా 4జీ, వైఫై 6, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 56WHR బ్యాటరీని అందించారు. 29 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఈ ల్యాప్ టాప్ అందించనుంది. ఏసర్ స్పిన్ 7 టచ్ జెస్చర్లను కూడా సపోర్ట్ చేయనుంది. బరువు 1.4 కేజీలుగానూ ఉంది.

ఇవీ కూడా చదవండి: Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌.. మైలేజీ ఎంతంటే..?

Xiaomi – India: ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ భారత్‌లో విడుదల.. అద్భుతమైన ఫీచర్లు..

Oppo A53s 5G Phone : ఒప్పో A53s 5G ఫోన్ భారత్‌లో ఏప్రిల్ 27 న విడుదల.. ధర రూ.15 వేలు.. అద్భుతమైన ఫీచర్లతో..