Bank Holidays: బ్యాంకుల్లో పనుంటే ఇప్పుడే చేసుకోండి.. మే నెలలో 12 సెలవులు.. సమయంలో మార్పులు

Bank Holidays List May 2021: మీకు మే నెలలో బ్యాంకుల్లో ఏమైనా పనులుంటే.. ఇప్పుడే మీరు పూర్తిచేసుకోవడం మంచిది. ఎందుకంటే.. వచ్చే నెల మేలో

Bank Holidays: బ్యాంకుల్లో పనుంటే ఇప్పుడే చేసుకోండి.. మే నెలలో 12 సెలవులు.. సమయంలో మార్పులు
Bank Holidays
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 25, 2021 | 3:08 PM

Bank Holidays List May 2021: మీకు మే నెలలో బ్యాంకుల్లో ఏమైనా పనులుంటే.. ఇప్పుడే మీరు పూర్తిచేసుకోవడం మంచిది. ఎందుకంటే.. వచ్చే నెల మేలో వరుసగా బ్యాంకులకు సెలవులున్నాయి. ఏప్రిల్ నెల మాదిరిగా మే నెలలో కూడా సెలవులు వచ్చాయి. ఈ నెలలో మొత్తం 12 రోజులు సెల‌వులు వ‌స్తున్నాయి. దీంతోపాటు కరోనావైరస్ కారణంగా ఆర్‌బీఐ పలు నిబంధనలు కూడా విధించనుంది. మే నెలలో వచ్చే సెలవుల గురించి ఒకసారి పరిశీలిద్దాం..

మే 1 మహారాష్ట్ర దినోత్సవం / మేడే. మే 2.. ఆదివారం య‌ధావిధిగా బ్యాంకులకు సెల‌వుదినం. మే 7 వ తేదీన జ‌మాతుల్ విదా సంద‌ర్భంగా బ్యాంకుల‌కు సెల‌వు. మే 8 రెండో శ‌నివారం సెలవు మే 9 ఆదివారం సెలవు. మే 13 న ఈదుల్ ఫిత‌ర్‌ సెలవు మే 14 న రంజాన్‌, పరుశురామ్ జయంతి మే 16 ఆదివారం సెలవు మే 22 నాలుగో శ‌నివారం సెలవు మే 23 ఆదివారం సెలవు మే 26 బుద్ధ‌పూర్ణిమ‌ సెలవు మే 30 ఆదివారం సెల‌వులు ఉండ‌నున్నాయి. అయితే.. కొన్ని రాష్ట్రాలకు ప్రాంతీయ పండుగలకు అనుగుణంగా సెలవులు ఉంటాయి. మిగతా రాష్ట్రాలకు ఉండవు..

ఇదిలాఉంటే.. కరోనా వైర‌స్ సెకండ్ వేవ్ కారణంగా బ్యాంకులు 4 గంటలు మాత్రమే తెరుచుకోనున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సూచించింది. అంటే ఇప్పుడు బ్యాంకులు సాధారణ ప్రజలకు 4 గంటలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్గదర్శకాలను పాటించాలని అన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ కమిటీలను ఐబీఏ ఆదేశించింది.

Also Read:

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

Prickly Heat: చెమటకాయలతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఇలా చేస్తే తగ్గిపోతాయి..