Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MUDRA Loan: లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం పోయిందా.. అయినా ఏం పర్వాలేదు.. ఈ స్కీం ద్వారా మీకు రూ. 10 లక్షల వరకు లోన్..!

కరోనా లాక్‌డౌన్‌తో చేసేందుకు పని కరవై, కడపు నింపుకునేందుకు మార్గం కనిపించక దిక్కుతోచనిస్థితిలో పడిపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ముద్ర యోజన (MUDRA) ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు.

MUDRA Loan: లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం పోయిందా.. అయినా ఏం పర్వాలేదు.. ఈ స్కీం ద్వారా మీకు రూ. 10 లక్షల వరకు లోన్..!
Pm Mudra Yojana
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 26, 2021 | 6:55 AM

PM MUDRA Loan: కరోనా కారణంగా అన్ని రంగాలు సంక్షోభంలో మునిగిపోయాయి. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కొన్ని సంస్థలు మూతపడ్డాయి. దీంతో ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్న ఊర్లో.. వచ్చే తక్కువ జీతానికైనా సరేనని పని చేసుకునే వీరి జీవితాలు దుర్భరమయ్యాయి. చేసేందుకు పని కరవై, కడపు నింపుకునేందుకు మార్గం కనిపించక దిక్కుతోచనిస్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. దీంతో చాలా మంది వంద రోజుల పనికి వెళ్తుండగా.. పలువురు గొర్ల కాపర్లుగా.. మరికొందరు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఏ ఆధారమూలేని వాళ్లు అడ్డా మీద దినసరి కూలీలుగా కూడా మారుతున్నారు. ఏదోక పని చేసుకుంటూ బతుకు బండిని ఈడ్చుకొస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ముద్ర యోజన (MUDRA) ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు.

రూ .10 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి 2015 ఏప్రిల్ 8 న పీఎం మోదీ ప్రభుత్వం ముద్ర యోజనను ప్రారంభించింది. దీని ద్వారా ఇఫ్పటి వరకు కోట్లాది మంది లబ్ది పొందిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద, వ్యాపారం ప్రారంభించడానికి, లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి బ్యాంకు నుండి 10 లక్షల రూపాయల వరకు రుణం సులభంగా పొందవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో, కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో చాలా మంది తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. కాని కొన్ని బ్యాంకులు వారికి ప్రధాన మంత్రి ముద్ర రుణాలు ఇచ్చేందుకు అంతగా ఇష్టం చూపడం లేదు. ఒక వేళ మీరు అలాంటి పరిస్థితి ఎదుర్కొని బ్యాంకు రుణం పొందేందుకు ఇబ్బంది పడితే వెంటనే, మీరు టోల్ ఫ్రీ నంబర్‌పై ఫిర్యాదు చేయవచ్చు.

అయితే, ముద్ర రుణం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, మొదట, మీరు ఏ కేటగిరీలో రుణం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. ముద్రా పథకం కింద శిశు లోన్, కిషోర్ లోన్, తరుణ్ లోన్ అనే మూడు రకాల రుణాలు ఉంటాయి. దీని కింద రూ. 50 వేల నుంచి రూ .10 లక్షల వరకు రుణం పొందే నిబంధన ఉంది. అయితే, ముద్రా రుణం తీసుకోవడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం చెబుతుంది, కాని బ్యాంకులు మాత్రం అర్హులకు సైతం కొన్ని సందర్భాల్లో రుణాలు ఇచ్చేందుకు వెనకాడుతున్నాయి.

3 కేటగిరీలలో ముద్ర రుణాలుః ముద్ర యోజన అంటే మైక్రో యూనిట్ డెవలప్‌మెంట్ రిఫైనాన్స్ ఏజెన్సీ (MUDRA)కు సంక్షిప్త రూపం. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే, మీరు ఈ పథకం కింద బ్యాంకు నుండి రూ. 10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. మీ సమాచారం కోసం, ముద్ర యోజన కింద, శిశు లోన్, కిషోర్ లోన్, తరుణ్ ముద్రా లోన్ అనే మూడు రకాలు ఉన్నాయి.

శిశు ముద్ర లోన్ః ఎవరైనా చిరు వ్యాపారం ప్రారంభించినా లేదా స్టార్ట్ అప్ చేసినా రూ .50 వేల వరకు రుణం పొందవచ్చు.

కిషోర్ ముద్ర రుణంః ఈ పథకం కింద, సొంత వ్యాపారం ఉన్నవారు రూ. 50 వేల నుండి రూ. 5 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏడాదికి 14 నుండి 17 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

తరుణ్ ముద్ర రుణంః వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది రూ .10 లక్షల వరకు రుణం పొందవచ్చు. దీనికి ఏడాదికి 16 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ముద్ర లోన్ కోసం ముందుగా వెబ్‌సైట్‌లో అవసరమైన ఫారమ్‌ను మీ రుణ ప్రతిపాదనతో నింపాలి. దరఖాస్తు చేయడానికి https://www.mudra.org.in/ పై క్లిక్ చేయండి. ఇది నిర్దేశించిన రుణ అవసరానికి దరఖాస్తు చేసుకోవాలి.

మీకు లోన్ సంబంధించిన పూర్తి వివరాల కోసం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అవసరమైతే, ఈ టోల్ ఫ్రీ నంబర్లపై ఫిర్యాదు చేయండి : 1800 180 1111 మరియు 1800 11 0001

ముద్ర రుణం పొందేందుకు కావల్సిన పత్రాలుః

ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ముద్ర రుణం తీసుకోవటానికి కావల్సిన ధృవపత్రాలుః

  • ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ జారీ చేసిన గుర్తింపు కార్డు
  • నివాస ధృవీకరణ పత్రం
  • బ్యాంక్ స్టేట్‌మెంట్
  • లేటెస్ట్ ఫోటోలు
  • వ్యాపారానికి సంబంధించిన అమ్మకపు పత్రాలు
  • వ్యాపార నిర్వహణకు సంబంధించిన ధరల కొటేషన్లు
  • బిజినెస్ ఐడి, అడ్రస్ సర్టిఫికేట్ తప్పనిసరి అవసరం
  • జీఎస్టీ గుర్తింపు సంఖ్య
  • ఆదాయపు పన్ను రిటర్న్ గురించి సమాచారం

ఈ పూర్తి వివరాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also…  Gold Price Today: మహిళలు ఇదే మంచి అవకాశం.. మరోసారి తగ్గిన బంగారం ధరలు..ఇవాళ గోల్డ్ రేట్స్ ఇలా..