కోవిడ్ పై పోరులో నేనూ, గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ కు రూ..కోటి విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్

కోవిడ్ పై జరిపే పోరులో తానూ ఉన్నానని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అంటున్నాడు. క్రికెటర్ గౌతమ్ గంభీర్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ కి ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.

కోవిడ్ పై పోరులో నేనూ, గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ కు రూ..కోటి విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్
Akshay Kumar Donates Rs. 1 Crore
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Apr 25, 2021 | 5:55 PM

కోవిడ్ పై జరిపే పోరులో తానూ ఉన్నానని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అంటున్నాడు. క్రికెటర్ గౌతమ్ గంభీర్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ కి ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. కోవిడ్ పాండమిక్ తో బాధ పడుతున్న రోగులకు సాయపడేందుకు ఈ నిధులను వినియోగించాలని ఆయన కోరాడు. దీనిపై స్పందించిన గౌతమ్ గంభీర్.. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరు చేసే సహాయమైనా ఆశా కిరణమవుతుందని అంటూ అక్షయ్ కి కృతజ్ఞతలు తెలిపాడు. కోవిడ్ కారణంగా బాధ పడుతున్న వారికి ఆహారం, మందులు, ఆక్సిజన్ వంటివి సమకూర్చడానికి తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని ట్వీట్ చేశాడు.  గాడ్ బ్లెస్ యూ అని మనస్ఫూరిగా అక్షయ్ ని అభినందించాడు. దీనిపై అక్షయ్..ఇది చాలా కష్ట కాలమని, ఈ సంక్షోభం నుంచి మనం త్వరలో బయటపడుతామని ఆశిస్తున్నానని అన్నాడు. ఇలా హెల్ప్ చేయాల్సి రావడం తనకు సంతోషం కలిగిస్తోందని ట్వీట్ చేశాడు.

ఈ  నెలారంభంలో తన ‘రామసేతు’ చిత్రం షూటింగ్ మాధ్ దీవుల్లో జరుగుతుండగా అక్షయ్ కుమార్ కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యాడు. ఆయన చిత్ర బృందంలోని 45 మంది సిబ్బంది కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.  ముంబైలోని ఆసుపత్రిలో అక్షయ్ వారం  రోజులపాటు చికిత్స పొందాడు. గత ఏడాది కూడా కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి సహాయ నిధికి 25 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశాడు. కాగా-  ఇండియాలో ఆదివారం నాటికీ మొత్తం 349,691 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖవర్గాలు తెలిపాయి. 2,767 మంది రోగులు మృతి చెందినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. అటు-ఢిల్లీ లోని వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ అందుతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Facebook: ఫేస్ బుక్ అధినేత అయినా ఒక తండ్రికి బిడ్డే.. వైరల్ గా మారిన మార్క్ జుకర్‌బర్గ్‌ తండ్రి కామెంట్స్!

పీఎం కేర్స్ ఫండ్ నిధులతో దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు, కేంద్రం వెల్లడి