Corona Pandemic: మాస్క్ లు ధరించండి బాబులూ అంటూ సల్మాన్ రాధే సినిమా ట్రైలర్ ను వాడేసిన ముంబయి పోలీసులు.. సూపర్ అంటున్న నెటిజనం!
కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న వేళలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ముంబయి పోలీసుల ప్రయత్నాలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి.
Corona Pandemic: కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న వేళలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ముంబయి పోలీసుల ప్రయత్నాలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఏ రకంగా చెబితే బాగా అర్ధం అవుతుందో ఆ రకంగా ముంబయి పోలీసులు పోస్ట్ లు పెడుతున్నారు. అలాగే, ప్రజలు అడిగిన ప్రశ్నలకూ తమదైన శైలిలో సమాధానాలు ఇస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు ముంబయి పోలీసులు. ఇప్పుడు తాజాగా కరోనాను అడ్డుకోవడానికి మొదటి, తప్పనిసరి జాగ్రత్త అయిన మాస్క్ ధరించడం అనే విషయంపై సల్మాన్ ఖాన్ రాధే సినిమా టీజర్ ను వాడేసుకున్నారు. ముంబయి పోలీస్ రాధే మీమ్‌తో ఫేస్ మాస్క్‌లు ధరించడం గురించి చక్కగా వివరించారు. దీంతో ఈ మీమ్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్ళింది. తమ రోజు వారి ట్విట్టర్ ఖాతాలోముంబయి పోలీసులు సల్మాన్ ఖాన్ రాధే ట్రైలర్ సహాయం తీసుకున్నారు, పౌరులు ఫేస్ మాస్క్ లేకుండా బయటకు వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుందో చెప్పటం కోసం ఈ మీమ్ వదిలారు. “పౌరులు తమ ముసుగులు ధరించకుండా బయటకు వెళ్ళినప్పుడు: కరోనావైరస్: (sic)” అనే శీర్షికతో పోస్ట్ చేశారు.
When citizens step out without wearing their masks:
Coronavirus: pic.twitter.com/RteFuiJQRl
— Mumbai Police (@MumbaiPolice) April 25, 2021
ఈ చిత్రంలో కోవిడ్ -19 వైరస్ పాత్రలో రణదీప్ హుడా నటించాడు. ఇక ముంబై పోలీసుల చమత్కారమైన పోస్ట్ ల పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
You may be able to help more people by sharing this dashboard of #India #COVID19 tweets regarding availability of beds, oxygen and more, organized by location and updated real-time by @Sprinklr https://t.co/PcwtjzH8iI
— Asha Aravindakshan (@DCasha) April 25, 2021
ఏప్రిల్ 22 న సల్మాన్ ఖాన్ రాధే యొక్క ట్రైలర్ ఇంటర్నెట్లో వచ్చిన తరువాత ఈ మీమ్ ప్రస్తుతం సందడి చేస్తోంది. కాగా, ఈ చిత్రం మే 13, 2021 న ఈద్ థియేటర్లలో విడుదల అవుతుంది.
ముంబయి పోలీసులు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ వస్తున్నారు. ఈ భయానక సమయాల్లో ఆరోగ్య మార్గదర్శకాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను పౌరులకు నేర్పడానికి వారు ఫన్నీ మరియు చమత్కారమైన మీమ్‌లను పంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటె.. గత 24 గంటల్లో భారత్‌లో 3,49,691 కొత్త కేసులు నమోదయ్యాయి. 67,160 కేసులతో మహారాష్ట్ర, 37,944 కేసులతో ఉత్తర ప్రదేశ్, 29,438 కేసులతో కర్ణాటక, కేరళ 26,685 కేసులతొ ఉండగా, ఢిల్లీలో 24,103 కేసులు నమోదయ్యాయి.
Also Read: Covid Review: తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ విజృంభణ.. నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సర్కార్లు సీరియస్