India Vaccination: జోరుగా వ్యాక్సినేషన్ ప్రాసెస్.. మరికొన్ని టీకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వచ్చేది ఎప్పుడంటే?

దేశంలో ఓ వైపు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రంగా వుంది... ఇంకోవైపు వ్యాక్సినేషన్ ప్రాసెస్‌ను కేంద్రం వేగవంతం చేసింది. దాంతో రికార్డు స్థాయిలో మన దేశంలో కేవలం 99 రోజుల్లో ఏకంగా 14 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ చేరింది. రానున్న రోజుల్లో...

India Vaccination: జోరుగా వ్యాక్సినేషన్ ప్రాసెస్.. మరికొన్ని టీకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వచ్చేది ఎప్పుడంటే?
Covid Vaccine In India
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 25, 2021 | 4:57 PM

India Vaccination process speeded up: దేశంలో ఓ వైపు కరోనా వైరస్  (CORONAVIRUS)సెకెండ్ వేవ్ తీవ్రంగా వుంది… ఇంకోవైపు వ్యాక్సినేషన్(VACCINATION) ప్రాసెస్‌ను కేంద్రం వేగవంతం చేసింది. దాంతో రికార్డు స్థాయిలో మన దేశంలో కేవలం 99 రోజుల్లో ఏకంగా 14 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ చేరింది. రానున్న రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ (VACCINE DISTRIBUTION)ని వేగవంతం చేయాలని ప్రధాన మంత్రి (PRIME MINISTER_ నరేంద్ర మోదీ (NARENDRA MODI).. మరికొన్ని వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పంపిణీ అవుతున్న కోవిషీల్డు (COVI SHIELD), కోవాక్సిన్ (COVAXINE) వ్యాక్సిన్లతోపాటు స్పుత్నిక్ వీ (SPUTNIC V) వ్యాక్సిన్‌కు కూడా ఇటీవలే ఆమోదం లభించింది. తాజాగా హైదరాబాద్ (HYDERABAD) నగరానికి చెందిన వ్యాక్సిన్, ఫార్మస్యూటికల్ కంపెనీ బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) అభివృద్ది చేసిన కోవిడ్ టీకా మూడోదవకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) అనుమతులు మంజూరు చేసింది. బీఇ (BE) గతేడాది నవంబర్‌ రెండో వారంలో మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించింది. రెండు దశలనూ విజయవంతంగా పూర్తి చేశామని.. మంచి సానుకూల ఫలితాలు వచ్చాయని బీఇ ఎండీ మహిమ దాట్ల తెలిపారు. ఈ మేరకు రెండు దశల రిపోర్టులను సీడీఎస్సీఓకు బీఈ సమర్పించగా.. మూడో క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు లభించాయి. దాంతో దేశీయంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్లలో మూడోది రంగంలోకి రావడానికి సమయం దగ్గరవుతోంది. తొలి రెండు దశల పరీక్షలో పాల్గొన్న వారి భద్రత, రోగనిరోధక శక్తిని అంచనా వేశామన్నారు. రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌లో చాలా పాజిటివ్‌ ఫలితాలను చూశామని.. మూడో దశలో ఆశాజనక ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 18–80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1,268 ఆరోగ్యవంతుల మీద మూడో దశ పరీక్షలుంటాయని పేర్కొన్నారు. 18–65 ఏళ్ల వయస్సు వారికి రెండు మోతాదులలో వ్యాక్సిన్‌ ఉంటుంది. 28 రోజుల కాల వ్యవధిలో ఇంట్రామస్కులర్‌ ఇంజక్షన్ (INTRA-MASCULAR INJECTION)‌ ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉంటుంది.

దేశీయంగా వ్యాక్సిన్ల తయారీ వేగవంతం కాగా.. మన దేశ జనాభా దృష్ట్యా విదేశీ వ్యాక్సిన్లను రప్పించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం యత్నాలు వేగవంతం చేసింది. రష్యా రూపొందించిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ మనకు కావాల్సిన స్థాయిలో తయారీ అయి.. ప్రజలకు అందుబాటులో రావడానికి మరో రెండు నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. మరోవైపు అమెరికాకు చెందిన ఫైజర్‌ టీకాకు వచ్చే వారం ఆమోదం లభించే పరిస్థితి కనిపిస్తోంది. మన దేశంలో ఉధృతి దృష్ట్యా సాయంమందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. భారత్‌కు వ్యాక్సిన్ పంపిణీలో సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా ప్రకటించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనదేశానికి ఏ మాత్రం సరిపోని దాయాది దేశం పాకిస్తాన్‌ కూడా మనదేశానికి కరోనా పోరాటంలో సాయం చేస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మన దేశంలో ఓ వైపు శరవేగంగా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. కేవలం 99 రోజుల్లో 14 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ చేరింది. అమెరికాకు సైతం సాధ్యం కాని వేగవంతమైన వ్యాక్సిన్ పంపిణీని మన దేశం కొనసాగిస్తోంది. 140 కోట్లకు పైగా జనాభా వుండి.. జనసాంద్రత అధికంగా వుండే నగరాలు ఎన్నో వున్నాయి. అందుకే దేశంలో సెకెండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దానికి తోడు కరోనా సోకిన వారిలో చాలా మంది కోలుకుంటుండడం, వ్యాక్సిన్ పంపిణీ మొదలవడంతో దేశ ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోవడమే ప్రస్తుతం సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడమే ఇపుడు కీలకం. తప్పనిసరిగా మాస్కులు (వీలైతే డబుల్ మాస్కులు) ధరించడం, సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించడం, శానిటైజర్ల వినియోగం ద్వారానే కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చు. ఈవిషయంలో మరింత జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

ALSO READ: తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ విజ‌ృంభణ.. నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సర్కార్లు సీరియస్