Covid Vaccine: ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..

Covid Vaccine: ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 15, 2024 | 5:54 PM

కోవిడ్19 మహమ్మారి రెండేళ్ల పాటు విలయతాండవం చేసింది.. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ ప్రధాన కారణమని ప్రజల్లో అపోహ నెలకొంది.. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండె పోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు.

దేశంలో గుండెపోటు కారణంగా ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని ICMR పరిశోధనలో పేర్కొంది. ఇలాంటి మరణాలకు 5 అంశాలు కారణమని నివేదికలో పేర్కొన్నారు. ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ పరిశోధన 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రులలో నిర్వహించింది. ICMR పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న.. ఎటువంటి వ్యాధి లేని వ్యక్తులను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను తయారు చేసింది. కరోనా వ్యాక్సిన్‌తో దేశంలోని యువత, పెద్దలలో ఆకస్మిక మరణాల ప్రమాదం పెరగదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR అధ్యయనం ద్వారా స్పష్టమైంది. పరిశోధన సమయంలో.. ICMR అకస్మాత్తుగా మరణించిన 729 కేసులను శాంపిల్స్‌గా తీసుకుంది.. అయితే మొత్తంగా 2వేల916 నమూనాలు తీసుకోన్నారు.. కొందరు గుండెపోటు వచ్చిన తర్వాత బతికి ఉన్నట్లు తెలిపారు. ఒకటి లేదా రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి కారణం లేకుండా ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలో వెల్లడైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.