సర్కార్ బంపరాఫర్.. వారి సమాచారం ఇస్తే జేబులోకి లచ్చిందేవి!
06 January 2025
TV9 Telugu
TV9 Telugu
రహదారులపై, వీధుల్లో, గుడుల వద్ద.. భిక్షాటన చేసేవారు కోకొల్లలు. పిల్లలు మొదలు పండు ముదుసలి వరకు రకరకాల వ్యక్తులు భిక్షాటన చేస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం
TV9 Telugu
మరికొన్ని చోట్ల భిక్షాటన వృత్తిగా చేపట్టిన పలువురు నగర వీధుల్లో, ప్రధాన కూడళ్లలో భిక్షాటన చేస్తుంటారు. ఇక ఇలాంటి వాళ్ల ఆగడాలకు సర్కార్ చెక్ పెట్టేందుకు గట్టిగా నిర్ణయించుకుంది
TV9 Telugu
ఇండోర్ నగరంలో భిక్షాటనను నిషేధం విధించారు. అంతేకాకుండా తమ ప్రాంతాలలో భిక్షాటన చేసే వ్యక్తుల గురించి సమాచారం అందిస్తే రూ. 1,000 రివార్డ్ అందిస్తామని అధికారులు ప్రకటించారు. భిక్షాటన చేయడం, బిచ్చగాళ్ల కోసం వస్తువులను కొనడం అక్కడ పూర్తిగా నిషేధం
TV9 Telugu
సంపూర్ణ నిషేధం విధించిన ఇండోర్ నగరం.. భిక్షాటన చేసేవారి సమాచారం అందిస్తే రూ. 1,000 రివార్డ్‌ను ప్రకటిస్తూ జనవరి 2న నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది
TV9 Telugu
బిచ్చగాళ్ల గురించిన సమాచారాన్ని పంచుకునేందుకు మొబైల్ ఫోన్ నంబర్‌ను కూడా జారీ చేశారు. గత నాలుగు రోజుల్లో సుమారు 200 మంది మొబైల్ నంబర్‌కు కాల్ చేశారని, 12 మంది అందించిన సమాచారం సరైందిగా తేలినట్లు ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ చెబుతున్నారు
TV9 Telugu
వీరిలో ఆరుగురికి సోమవారం జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున రివార్డు అందించారు. నిబంధనలకు వ్యతిరేకంగా భిక్షాటన చేస్తే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు
TV9 Telugu
నేరం రుజువైతే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 5 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. గత 4 నెలల్లో 400 మందిని పునరావాస కేంద్రాలకు పంపించగా, 64 మంది పిల్లలను శిశుసంరక్షణ సంస్థకు పంపారు
TV9 Telugu
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఇండోర్‌తో సహా దేశంలోని 10 నగరాలను యాచకుల రహితంగా మార్చడానికి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే