మన అలవాట్లు వెనుక ఆరోగ్య రహస్యం.. చేతితో భోజనం చేస్తే ఎంత మంచిదో తెలుసా 

06 January 2025

Pic credit-Pexel

TV9 Telugu

చేతులతో భోజనం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు సంతృప్తి కలుగుతుంది. చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

  అహారాన్ని చేతితో తాకగానే ఆహారం తినే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అప్పుడు కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి.. దీంతో జీర్ణశక్తి బాగా జరుగుతుంది.

  చేతితో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య కరం. ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఆహారం తింటారు.

  ముఖ్యంగా ఆహారం ఎంత వేడిగా లేదా చల్లగా ఉంటుందో మన మెదడకు సమాచారాన్ని పంపుతుంది.

  తినే ఆహారాన్ని నూనె వంటి వాటితో తయారు చేస్తారు. ఈ ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తినడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.

  వేళ్ళతో ఆహారం కలుపుకొని.. ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని తినడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.

  చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.

   చేతితో తినటం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో తెలుస్తుంది. అదే విధంగా రక్త ప్రవాహాన్ని పెంచి, కండరాలకు శిక్షణలాగా ఉపయోగపడుతుంది.