World Largest Ship: ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ ప్రయాణానికి సిద్ధం..ప్రారంభమైన బుకింగ్..టికెట్ ఎంతో తెలుసా? ఈ ఓడ విశేషాలు మీకోసం!

ప్రయాణాలు అంటే ఇష్టం ఉన్నవారికి అందులోనూ సముద్ర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఓ పెద్ద శుభవార్త.

World Largest Ship: ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ ప్రయాణానికి సిద్ధం..ప్రారంభమైన బుకింగ్..టికెట్ ఎంతో తెలుసా? ఈ ఓడ విశేషాలు మీకోసం!
Big Ship
Follow us
KVD Varma

|

Updated on: Apr 25, 2021 | 4:46 PM

World Largest Ship: ప్రయాణాలు అంటే ఇష్టం ఉన్నవారికి అందులోనూ సముద్ర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఓ పెద్ద శుభవార్త. పెద్ద అని ఎందుకు చెబుతున్నామంటే.. ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ ఓడలో ప్రయాణానికి టికెట్ల బుకింగ్ ప్రారంభం అయింది. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సిద్ధం చేసిన ఈ అతిపెద్ద ఓడ మార్చి 2022 లో తన తొలి ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ ప్రయాణానికి వాళ్ళు ‘వండర్ ఆఫ్ ది సీస్’ అని పేరు పెట్టారు. ఇందులో ప్రయాణించాలంటే ఒకరికి ఒకటిన్నర లక్షల రూపాయల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకూ టికెట్ ఖర్చు అవుతుంది. అదే..4 మంది కుటుంబ సూట్ కోసం సుమారు 27.5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రాయల్ కరేబియన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయాణం మొత్తం 9 రాత్రులు.. 8 పగళ్ళు ఉంటుంది. షాంఘై నుంచి జపాన్ వరకూ సాగే ఈ సముద్ర యానం టోక్యో, మౌంట్ ఫుజి, కుమామోటో, కగోషిమా, ఇషిగాకి అలాగే మియాజాకి వంటి ఓడరేవుల గుండా వెళుతుంది. మార్చి నుంచి నవంబర్ వరకూ ఈ యాత్ర ఇలానే నడుస్తుంది. ఆ తరువాత అంటే.. నవంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకూ ఇది ఆసియాలోని టాప్ రేటెడ్ ప్రదేశాలకు కూడా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. వీటిలో దక్షిణ కొరియా,వియత్నాం కూడా ఉన్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సరం అలాగే ఇతర సెలవులకోసం, వియత్నాం లోని చాన్, దక్షిణ కొరియాకు చెందిన బుసాన్, జెజుల నుంచి ఈ ఓడ ప్రయాణాలు సాగిస్తుంది.

ఈ భారీ ఓడకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విశేషాలు ఇవే..

  • రెండు వేలకు పైగా లగ్జరీ గదులు ఈ ఓడలో ఉన్నాయి.
  • దీనిలో 6,988 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు.
  • ఈ ఓడ 10 అంతస్తులతో ఉంటుంది. దీనిలో 18 డెక్ లు ఉన్నాయి.
  • అలాగే 2867 2867 స్టేటర్‌రూమ్‌లు (విలాసవంతమైన సూట్లు) ఉన్నాయి.
  • ఈ ఓడ పొడవు 1188 అడుగులు..వెడల్పు 210 అడుగులు అదేవిధంగా దీని బరువు 2.37 లక్షల తన్నులు.
  • ఇక ఈ ఓడలో పూల్, స్పోర్ట్స్ జోన్, జిమ్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టుతో పాటు మినీ గోల్ఫ్ కోర్సు కూడా ప్రయాణీకుల వినోదం కోసం ఉన్నాయి.

Also Read: Viral News: వింత దేశం: ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వ‌రుడు తిమింగలం చేపల పళ్ళు తీసుకురావాలి

Coronavirus Vaccine: ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయం.. అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్..

ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. ఇలా ఇరుక్కుపోయారు
గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. ఇలా ఇరుక్కుపోయారు
బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..
బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!
రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!