AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెట్రోల్ ధరల కంటే గుర్రం దాణా ఖర్చులే తక్కువ.. బైక్ కు ప్రత్యామ్నాయంగా అశ్వం

దేశంలో పెట్రోల్(Petrol) ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న రేట్లతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఇప్పటికే సెంచరీ దాటేసిన లీటర్ పెట్రోల్ ధర.. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం( Russia - Ukraine War) కారణంగా మరింత పెరిగే...

Viral Video: పెట్రోల్ ధరల కంటే గుర్రం దాణా ఖర్చులే తక్కువ.. బైక్ కు ప్రత్యామ్నాయంగా అశ్వం
Petrol Prices
Ganesh Mudavath
|

Updated on: Mar 15, 2022 | 9:48 PM

Share

దేశంలో పెట్రోల్(Petrol) ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న రేట్లతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఇప్పటికే సెంచరీ దాటేసిన లీటర్ పెట్రోల్ ధర.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం( Russia – Ukraine War) కారణంగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బండి బయటకు తీయాలంటే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఎంతో మంది ఎన్నో రకాలుగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. బండ్లను తోపుడు బళ్లపై పెట్టడం, సైకిళ్లు, ఎడ్ల బండ్లపై ప్రయాణించడం వంటి నిరసనలు మనం ఎన్నో చూశాం. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు వైరల్(Viral) గా మారాయి. అయితే గతేడాది లాక్ డౌన్ సమయంలో మహరాష్ట్ర కు చెందిన షేక్ యూసుఫ్.. రవాణా సదుపాయాలు లేవని గుర్రం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన మరోసారి వార్తలలో నిలిచారు.

మహరాష్ట్రకు చెందిన షేక్ యూసుఫ్, స్థానిక కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. గతేడాది లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలు స్తంభించాయి. దీంతో రూ.40,000 ఖర్చు చేసి, ఒక గుర్రాన్ని కొనుగోలు చేశారు. దానికి జిగర్ అనే పేరు పెట్టారు. అప్పుడు దానిపైనే కాలేజీకి వెళ్లేవారు. ప్రస్తుతం పెరిగిపోతున్న పెట్రో ధరలు చూస్తుంటే.. గుర్రాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా తక్కువని అన్నాడు. దీనికి అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం పెట్రో ధరలు మరింత పెరుగుతుండటంతో తాన ద్విచక్రవాహనాన్ని నడపడం తగ్గించేశానని తెలిపారు. బైక్ కు అయ్యే పెట్రో ధరల కంటె గుర్రానికి అయ్యే ఖర్చు చాలా తక్కువని తెలిపారు.

ఇవీచదవండి.

Cat Video: బాబోయ్‌ పిల్లి కరిచింది..ఇద్దరు మహిళలు మృతి.. వినడానికి వింతగా ఉన్న.. విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Startup Companies: భారీగా పతనమవుతున్న స్టార్టప్‌ కంపెనీల షేర్లు.. కీలక నిర్ణయం దిశగా సెబీ అడుగులు..

Viral video: వేలెడంత లేడు కానీ వేదాంతాలు వల్లిస్తున్నాడుగా.. బ్రేకప్ గురించి ఈ బుడతడి మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..