AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని నివాసంలో మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా అత్యవసర భేటీ.. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు!

భారతీయ జనతా పార్టీ నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన నివాసంలో అత్యవసంర సమావేశం అయ్యారు.

PM Modi: ప్రధాని నివాసంలో మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా అత్యవసర భేటీ.. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు!
Modi Nadda Amit Shah
Balaraju Goud
|

Updated on: Mar 15, 2022 | 9:41 PM

Share

PM Narendra Modi Meeting: భారతీయ జనతా పార్టీ(BJP) ముఖ్యనేతలతో ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన నివాసంలో అత్యవసంర సమావేశం అయ్యారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), గోవా(Goa), మణిపూర్‌(Manipur)లలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. మార్చి 10న జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది.

ఉత్తరాఖండ్, మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో భారీ సమావేశాలు జరిగాయి. ఉత్తరాఖండ్ నుంచి పుష్కర్ సింగ్ ధామి ఢిల్లీ చేరుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ఢిల్లీలో దుమారం రేగింది. పలువురు రాష్ట్ర నేతలు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, పుష్కర్ ధామిలతో సమావేశమయ్యారు. సమావేశానికి ముందు పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. ‘మేము పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చామని, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్ పరిశీలిస్తుందని, ఆయన నిర్ణయమే అంతిమంగా ఉంటుందని’ అన్నారు. నిజానికి ఉత్తరాఖండ్‌లో 70 సీట్లకు గాను 47 సీట్లు సాధించిన బీజేపీకి సీఎం పేరు ఖరారు కాలేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా ఖతిమా స్థానం నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే, సీఎంగా మాత్రం ఆయన పేరు ముందంజలో వినిపిస్తోంది. వీరితో పాటు పదవీ మాజీ మంత్రి ధన్ సింగ్ రావత్, మరో మాజీ మంత్రి సత్పాల్ మహరాజ్, మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి భూషణ్, మాజీ మంత్రి గణేష్ జోషి పేర్లు కూడా చర్చలో ఉన్నాయి.

గోవాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా, భారతీయ జనతా పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడానికి ఈరోజు ఢిల్లీ వచ్చారు. లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపిక కోసం బీజేపీ గోవా యూనిట్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం బుధవారం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. శాసనసభా పక్ష నేత రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి అవుతారు.

Read Also…. 

Congress: 5 రాష్ట్రాల ఓటమితో కాంగ్రెస్‌లో మొదలైన ప్రక్షాళన.. పీసీసీ అధ్యక్షుల రాజీనామాలు కోరిన సోనియా!