Cat Video: బాబోయ్ పిల్లి కరిచింది..ఇద్దరు మహిళలు మృతి.. వినడానికి వింతగా ఉన్న.. విషయం తెలిస్తే షాక్ అవుతారు..
ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతిచెందారు. రెండు నెలల క్రితం ఇద్దరు మహిళలను పిల్లి కరవగా.. వారిద్దరు ఒకే రోజున మరణించిన దుర్ఘటన జిల్లాలోని మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది.
ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతిచెందారు. రెండు నెలల క్రితం ఇద్దరు మహిళలను పిల్లి కరవగా.. వారిద్దరు ఒకే రోజున మరణించిన దుర్ఘటన జిల్లాలోని మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. వేములమడలోని విశ్రాంత కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమలను, ప్రైవేటు వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. అయితే.. వారిద్దరూ వైద్యుల సలహా మేరకు టీటీ ఇంజక్షన్లు చేయించుకొని గాయాలు తగ్గడానికి మందులు వాడారు. అనంతరం కొద్ది రోజులకు గాయాల నుంచి ఉపశమనం కలిగింది. అయితే.. గాయం పూర్తిగా మానిన తర్వాత నాలుగు రోజుల క్రితం మళ్లీ ఇద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో కమల మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో.. నాగమణి విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో నాగమణి చికిత్స పొందుతూ మృతి చెందింది. కమల కూడా అదే రోజు మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.అయితే.. పిల్లి కరవడంతో ఇద్దరు మహిళలకు ర్యాబిస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. వారిని కరిచిన పిల్లి కుక్కకాటుకు గురై మరణించినట్లు తెలిసింది. పిల్లి, కుక్క, ఎలుక, పాము లాంటి జంతువులు కరిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని స్థానిక ప్రభుత్వ వైద్యులు సూచించారు. కాగా.. ఇద్దరు మహిళలు పిల్లి కరిచిన రెండు నెలల తర్వాత ఒకే రోజు చనిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

