Fire Accident: అంబులెన్స్‌లో భారీ పేలుడు.. తృటిలో తప్పించుకున్న నిండు గర్భిణి!

ఓ అంబులెన్స్‌లో గర్భిణీని తన కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు.

Fire Accident: అంబులెన్స్‌లో భారీ పేలుడు.. తృటిలో తప్పించుకున్న నిండు గర్భిణి!
Ambulance Fire
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Balaraju Goud

Updated on: Nov 14, 2024 | 9:37 AM

పాపం.. ఆ కుటుంబం ఓ గర్భిణీ మహిళను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊహించని పరిణామానికి ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. అయితే.. మొత్తానికి తృటిలో ఆ గర్భిణీ, ఆమె కుటుంబం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మహారాష్ట్ర రాష్ట్రం జల్గావ్ జిల్లాలోని దాదావాడి ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ అంబులెన్స్‌లో గర్భిణీని తన కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు. ఇంతలో తన వాహనం నుంచి పొగలు రావడంతో అంబులెన్స్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనం దిగిపోయాడు. అదే విధంగా అంబులెన్స్‌లో ఉన్నవారిని కూడా తక్షణమే కిందికి దిగాలని కోరాడు. ఆ తర్వాత వాహనం మొత్తం మంటలు వ్యాపించి అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌కు అంటుకున్నాయి. దీంతో పెద్ద పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించింది. అప్పటికే అంబులెన్స్‌లో ఉన్నవారు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఇదిలా ఉండగా, సంఘటనా స్థలంలో స్థానికులు గుమిగూడడంతో హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మంత్రి గులాబ్‌రావు పాటిల్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు.

వీడియో చూడండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే