Maharashtra Political Crisis: మహారాష్ట్ర సీఎం రాజీనామాకు ముందు కీలక నిర్ణయం.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి..

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో హై డ్రామా కొనసాగుతూనే ఉంది. తిరుగుబాటు గ్రూపులో ఎమ్మెల్యేల సంఖ్య గంట గంటకు పెరుగుతుంటే.. సేన చీఫ్‌ షాక్‌లో కూరుకు పోయారు..

Maharashtra Political Crisis: మహారాష్ట్ర సీఎం రాజీనామాకు ముందు కీలక నిర్ణయం.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి..
Follow us
Subhash Goud

|

Updated on: Jun 23, 2022 | 8:10 AM

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో హై డ్రామా కొనసాగుతూనే ఉంది. తిరుగుబాటు గ్రూపులో ఎమ్మెల్యేల సంఖ్య గంట గంటకు పెరుగుతుంటే.. సేన చీఫ్‌ షాక్‌లో కూరుకు పోయారు. ఇప్పటికే అసహనానికి గురైన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే అధికార సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. అటు.. తిరుగుబాటు నేత, మంత్రి ఏక్​నాథ్ షిండే మాట్లాడుతూ.. మహా అఘాడి కూటమి నుంచి శివసేన బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. అర్ధరాత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. వర్ష బంగ్లా నుంచి తన లగేజీతో పాటు కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న శివసేన కార్యకర్తలు, నేతలు కంట నీరు పెట్టుకున్నారు. అధికార బంగ్లాను ఖాళీ చేయొద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు.

రాజకీయాల్లో గందరగోళం నెలకొనడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. అటు.. ఈ పరిణామాలపై స్పందించిన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే.. కూటమి నుంచే బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. శివసేన మనుగడ కోసం అసహజమైన పొత్తు నుంచి బయటపడటం ఎంతో అవసరమన్నారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసంగించిన తర్వాత.. షిండే ట్విట్టర్‌లో స్పందించారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో కేవలం కాంగ్రెస్‌, ఎన్సీపీలే లబ్ధి పొందాయని.. శివసైనికులు మునిగిపోయారన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో, దీనికి ముందు, ఏక్నాథ్ షిండే, థాకరేకు సమాధానమిస్తూ, గత రెండున్నరేళ్లలో, MVA ప్రభుత్వంలో మిత్రపక్షాలు మాత్రమే లబ్ధి పొందాయని, శివసేన, శివసైనికులు నష్టపోయారని అన్నారు. ఈ సమయంలో, మిత్రపక్షాలు బలపడగా, శివసేన, శివసైనికులు బలహీనపడ్డారు. మిత్రపక్షాలు బలపడుతుండగా, శివసేన-శివసేన క్రమపద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నాయి. పార్టీ, శివసైనికుల మనుగడ కోసం, అసాధారణమైన ఫ్రంట్ నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి.

క్షణక్షణం కొత్త కొత్త మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర