AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ఆ సీక్రెట్ మాత్రం చెప్పలేదు.. ఈడీ విచారణపై తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ..

ఇన్ని రోజులు, ఇన్ని గంట‌ల పాటు ప్రశ్నించాం క‌దా, అన్నింటికీ ఓపిక‌గా స‌మాధాన‌మిచ్చారు.. ఇంత ఓపిక‌, స‌హ‌నం మీకు ఎలా వ‌చ్చిందని ఈడీ అధికారులు త‌న‌ను ప్రశ్నించినట్టు రాహుల్ గాంధీ వెల్లడించారు.

Rahul Gandhi: ఆ సీక్రెట్ మాత్రం చెప్పలేదు.. ఈడీ విచారణపై తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Jun 23, 2022 | 5:48 AM

Share

Rahul Gandhi – ED officials: నేషనల్ హెరాల్డ్ కేసులో.. ఐదురోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి ప్రశ్నల వ‌ర్షాన్ని ఎదుర్కొన్న రాహుల్ గాంధీ, తొలిసారి విచారణపై స్పందించారు. పార్టీ కార్యక‌ర్తల స‌మావేశంలో తనను అడిగిన ప్రశ్నల గురించి వివరించారు. చివ‌రి రోజైన ఐదో రోజు ఈడీ అధికారులు త‌న‌ను ఒక ప్రశ్న అడిగార‌ని చెప్పారు. ఇన్ని రోజులు, ఇన్ని గంట‌ల పాటు ప్రశ్నించాం క‌దా, అన్నింటికీ ఓపిక‌గా స‌మాధాన‌మిచ్చారు.. ఇంత ఓపిక‌, స‌హ‌నం మీకు ఎలా వ‌చ్చిందని ఈడీ అధికారులు త‌న‌ను ప్రశ్నించినట్టు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆ ప్రశ్నకు తాను చాలా సింపుల్‌గా ఆన్సర్‌ చెప్పానని పేర్కొన్నారు.

11, 12 గంటలపాటు కుర్చీలో ఎలా కూర్చోగలిగారని గత రాత్రి ఈడీ అధికారులు అడిగారని.. దానికి అసలు కారణం చెప్పకూడదని అనుకున్నా.. అందుకే ‘విపాసన’ చేస్తానని అబద్దం చెప్పా అంటూ రాహుల్ పేర్కొన్నారు. తాను 2004 నుంచి కాంగ్రెస్‌లో ఉన్నానని, కాంగ్రెస్ వారిలో ఓర్పు, స‌హ‌నం స‌హ‌జంగానే ఉంటాయని తాను స‌మాధాన‌ం చెప్పినట్టు రాహుల్ గాంధీ వివ‌రించారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీ లాండ‌రింగ్ కేసులో 5 రోజుల పాటు, దాదాపు 53 గంట‌ల పాటు ఈడీ అధికారులు రాహుల్‌ను ప్రశ్నించారు. అటు, ఈడీకి సోనియాగాంధీ లేఖ రాశారు. కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, విచారణకు హాజరయ్యేందుకు మరింత గడువు కావాలని సోనియా ఈడీని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!