Maharashtra Political Crisis: క్యాంప్ ఆఫీసును ఖాళీ చేసిన సీఎం ఉద్ధవ్ థాకరే.. ఆఫీసు నుంచి సామగ్రిని తరలించిన సిబ్బంది
అన్నిదారులూ మూసుకుపోవడంతో గద్దె దిగేందుకు సిద్ధమయ్యారు ఉద్ధవ్. పదవిపై తనకు వ్యామోహం లేదని చెప్పిన ఉద్ధవ్ థాకరే.. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. ఫేస్‌బుక్ లైవ్ తర్వాత..
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే రాజీనామాకు రెడీ అయ్యారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏక్‌నాథ్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయింది ఉద్ధవ్ సర్కార్. అన్నిదారులూ మూసుకుపోవడంతో గద్దె దిగేందుకు సిద్ధమయ్యారు ఉద్ధవ్. పదవిపై తనకు వ్యామోహం లేదని చెప్పిన ఉద్ధవ్ థాకరే.. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. ఫేస్‌బుక్ లైవ్ తర్వాత.. కార్యాలయం నుంచి సామగ్రిని ఖాళీ చేసేశారు. మొన్నటిదాకా నేతలు, కార్యకర్తలు, అధికారులతో సందడిగా కనిపించే క్యాంప్ ఆఫీసు నేడు బోసిపోయి కనిపిస్తోంది. ఉద్ధవ్ థాకరే క్యాంప్ ఆఫీసును ఖాళీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. కార్యాలయాన్ని ఖాళీ చేయొద్దని వేడుకున్నారు. భావోద్వేగానికి గురైన పలువురు కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు.
#WATCH | Luggage being moved out from Versha Bungalow of Maharashtra CM Uddhav Thackeray in Mumbai pic.twitter.com/CrEFz729s9
— ANI (@ANI) June 22, 2022