కొంపముంచిన పాస్‌పోర్ట్.. భార్యకు దొరకొద్దని అలా చేస్తే ఏకంగా వారికే దొరికిపోయాడు..
Wife and Husband: అతనికి అప్పటికే పెళ్లి అయ్యింది.. మరోవైపు ప్రేయసి కూడా ఉంది. ఆ ప్రేయసితో ఏకాంతంగా గడపాలని ఫిక్స్ అయ్యాడు.

Wife and Husband: అతనికి అప్పటికే పెళ్లి అయ్యింది.. మరోవైపు ప్రేయసి కూడా ఉంది. ఆ ప్రేయసితో ఏకాంతంగా గడపాలని ఫిక్స్ అయ్యాడు. ఆ దిశగా వారిద్దరూ ప్లాన్స్ వేసుకున్నారు. ఇద్దరూ కలిసి విదేశీయాత్రకు వెళ్లారు. అయితే, విషయం తన భార్యకు తెలియకూడదనే ఉద్దేశ్యంతో పాస్‌పోర్ట్‌లో స్టాంప్ వేసిన పేజీలను చించివేశాడు. అదే అతని కొంప ముంచింది. ఊహించని రీతిలో జైలుపాలయ్యాడు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైకు చెందిన 32 ఏళ్ల ఇంజినీర్ ఒక ఎంఎన్‌సీలో పని చేస్తున్నాడు. ఆఫీస్ పనిమీద టూర్‌కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి.. తన ప్రేయసితో మాల్దీవులకు టూర్‌కు వెళ్లాడు. అయితే, భర్త చెప్పిన మాటలు భార్యలో అనుమానం కలిగించాయి. దాంతో అతను టూర్‌కు వెళ్లినప్పటి నుంచి కాల్స్ చేసింది. అతని నుంచి ఎలాంటి రెస్పాండ్స్ రాకపోవడంతో వాట్సాప్ కాల్స్ కూడా చేసింది. పరిస్థితి ఏదో తేడాగా ఉందని అలర్ట్ అయిన ఆ ఇంజనీర్ తన ప్రేయసితో కలిసి వెంటనే రిటర్న్ అయ్యాడు. అయితే, తన ట్రిప్ విషయం భార్యకు తెలియకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పాస్‌పోర్ట్‌లో వేసిన స్టాంప్ పేపర్లను చంపేశాడు. మాల్దీవుల నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఇమ్రిగేషన్ అధికారులు అతని పాస్‌పోర్ట్‌లో పేజీలు చిరిగి ఉండటాన్ని గమనించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు మ్యాటర్ బయటపెట్టాడు. పాస్‌పోర్ట్ దుర్వినియోగానికి పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. దీంతో మోసం, ఫోర్జరీ కింద అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే పాస్‌పోర్ట్ బుక్‌లో పేజీలు చించివేయడం నేరమన్న సంగతి తెలియక భార్య కళ్లుగప్పేందుకు అలా చేసినట్లు అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు. అలా భార్యకు దొరకొద్దని చేసిన పని.. ఉచలు లెక్కించేలా చేసింది.



