Petrol Diesel Prices: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆ రాష్ట్రంలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..
కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పలు రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకుంటున్నాయి.
Maharashtra govt: కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్ (petrol and diesel prices) పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50, లీటర్ డీజిల్‌పై 7 రూపాయల మేర తగ్గింది. దీంతో ఉజ్వల వంట గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇవ్వనున్నట్లు కేంద్రం (Central Govt) ప్రకటించింది. దీంతోపాటు ఇంధన ధరలపై వ్యాట్ తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పలు రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకుంటున్నాయి.
తాజాగా మహారాష్ట్రలో (Maharashtra) ని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చమురుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన విలువ ఆధారిత పన్ను (VAT) ను ఆదివారం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్‌పై 2.08 రూపాయలు, డీజిల్‌పై 1.44 రూపాయల మేర తగ్గింది. కాగా.. శనివారం పెట్రో ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయగానే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విమర్శలు చేశారు.. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రంలో ఇంధన ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం..
Maharashtra govt slashes VAT on petrol by Rs 2.08, diesel by Rs 1.44
Read @ANI Story | https://t.co/mV9CsfrSt7#Maharashtra #FuelPrice #PetrolDieselPriceCut #petrolPrice pic.twitter.com/wixnxX9CIl
— ANI Digital (@ani_digital) May 22, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..